అక్షరటుడే, వెబ్డెస్క్: Global Summit | తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit) ముగింపు దశకు చేరుకుంది. సెషన్లు ముగియడంతో విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్నారు. ఈ ముగింపు సమావేశానికి సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరు అయ్యారు. వివిధ దేశాలు, కంపెనీల ప్రతినిధుల సమక్షంలో విజన్ డాక్యుమెంట్ విడుదల చేశారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) మాట్లాడుతూ.. విజన్ డాక్యుమెంట్ ఓ గదిలో రూపొందించింది కాదన్నారు. విస్తృత సంప్రదింపులు, అభిప్రాయాల తర్వాతే రూపకల్పన చేశామని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ దిక్సూచిలా పని చేస్తుందన్నారు. ఈ విజన్ డాక్యుమెంట్ మనందరిదని పేర్కొన్నారు.
Global Summit | విమర్శలు స్వీకరిస్తాం
సమ్మిళిత వృద్ధి తెలంగాణ లక్ష్యం అని భట్టి స్పష్టం చేశారు. విజన్ డాక్యుమెంట్పై ఎలాంటివిమర్శలైనా స్వీకరిస్తామన్నారు. అద్భుత సమన్వయంతో డాక్యుమెంట్ను రూపొందించామని చెప్పారు. సోనియా పుట్టినరోజున డాక్యుమెంట్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. సుదీర్ఘ లక్ష్యాలకు విజన్ డాక్యుమెంట్ వేదిక కానుందని ఆయన తెలిపారు.
సమ్మిట్లో నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) మాట్లాడుతూ.. లోకల్ ఏరియాల చుట్టూ తిరిగే కథలతో తెరకెక్కించిన ‘కాంతార’, ‘పుష్ప’ సినిమాలు గ్లోబల్ స్థాయిలో నిలబడ్డాయన్నారు. స్థానిక ప్రాంతాలతో ముడిపడి ఉన్న కథలతో తీసిన సినిమాలే ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాయని వెల్లడించారు. సినిమా రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తోందన్నారు.