Homeబిజినెస్​Stock market | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు

Stock market | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock market | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. సోమవారం యూఎస్‌ మార్కెట్లు నష్టాలతో, యూరోప్‌ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి. మంగళవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు సైతం ఎక్కువగా లాభాలతో సాగుతున్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ(Gift nifty) పాజిటివ్‌గా ఉంది.

Stock market | యూఎస్‌ మార్కెట్లు..

యూఎస్‌ Inflation డాటా ఎలా ఉంటుందోనని మార్కెట్లు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. దీనిమీద ఆధారపడే యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్ల మార్పుపై నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడంతో వాల్‌స్ట్రీట్‌ (Wallstreet) నష్టాలతో ముగిసింది. నాస్‌డాక్‌ 0.30 శాతం, ఎస్‌అండ్‌పీ 0.25 శాతం నష్టపోగా.. మంగళవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ మాత్రం 0.14 శాతం లాభంతో కొనసాగుతోంది.

Stock market | యూరోప్‌ మార్కెట్లు..

ఎఫ్‌టీఎస్‌ఈ(FTSE) 0.37 శాతం పెరగ్గా.. సీఏసీ 0.58 శాతం, డీఏఎక్స్‌ 0.34 శాతం నష్టపోయాయి.

Stock market | ఆసియా మార్కెట్లు..

యూఎస్‌, చైనాల మధ్య వాణిజ్య సంధి గడువును మరో 90 రోజులు పొడిగించిన నేపథ్యంలో ఆసియా మార్కెట్లు ఆశావహ దృక్పథంతో సాగుతున్నాయి. ప్రధాన ఆసియా మార్కెట్లు ఎక్కువగా పాజిటివ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో నిక్కీ(Nikkei) 2.53 శాతం, కోస్పీ 0.68 శాతం, షాంఘై 0.36 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.23 శాతం లాభంతో ఉన్నాయి. స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.30 శాతం, హాంగ్‌సెంగ్‌(Hang Seng) 0.26 శాతం నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ 0.10 శాతం నష్టంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు ఫ్లాట్‌ టు పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Stock market | గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 1,202 కోట్ల విలువైన స్టాక్స్‌ అమ్మారు. డీఐఐ(DII)లు 26వ ట్రేడిరగ్‌ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా కొనసాగారు. నికరంగా రూ. 9,136 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.
  • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.66 నుంచి 1.03కి పెరిగింది. విక్స్‌(VIX) 1.54 శాతం పెరిగి 12.22కు చేరింది.
  • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.21 శాతం పెరిగి 66.77 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ ఒక పైస బలపడి 87.66 వద్ద నిలిచింది.
  • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.29 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 98.48 వద్ద కొనసాగుతున్నాయి.