Homeబిజినెస్​Gift nifty | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న గిఫ్ట్‌ నిఫ్టీ

Gift nifty | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న గిఫ్ట్‌ నిఫ్టీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: గ్లోబల్‌ మార్కెట్లు (Global markets) పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి. యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు గత ట్రేడింగ్‌ సెషన్‌లో లాభాలతో ముగిశాయి. గురువారం ఉదయం ఆసియా మార్కెట్లు సైతం పాజిటివ్‌గానే కొనసాగుతున్నాయి.

Gift nifty | అమెరికా మార్కెట్లు..

నాస్‌డాక్‌ (Nasdaq) 0.32 శాతం, ఎస్‌అండ్‌పీ 0.01 శాతం లాభంతో ముగిశాయి. డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ గురువారం ఉదయం ఫ్లాట్‌గా ఉంది.

Gift nifty | యూరోప్‌ మార్కెట్లు..

యూరోప్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. డీఏఎక్స్‌(DAX) 0.76 శాతం లాభపడగా.. సీఏసీ 0.52 శాతం, ఎప్‌టీఎస్‌ఈ 0.16 శాతం లాభపడ్డాయి.

Gift nifty | ఆసియా మార్కెట్లు..

ఆసియాలో నిక్కీ(Nikke) మినహా మిగిలిన ప్రధాన మార్కెట్లన్నీ లాభాల బాటలో పయనిస్తున్నాయి. నిక్కీ 0.24 శాతం, షాంఘై 0.06 శాతం నష్టంతో ఉండగా.. కోస్పీ 1.62 శాతం లాభంతో కదలాడుతున్నాయి. హంగ్‌సెంగ్‌ 0.82 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.17 శాతం లాభంతో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ (Gift nifty) 0.06 శాతం లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Gift nifty | గమనించాల్సిన అంశాలు..

  • ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు మూడు ట్రేడింగ్‌ సెషన్‌ల తర్వాత నెట్‌ బయ్యర్లుగా మారారు. బుధవారం నికరంగా రూ. 1,076కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. దీశీయ సంస్థాగత మదుపరులు మన మార్కెట్లపై నమ్మకంతో పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు. వరుసగా 12 సెషన్లుగా నెట్‌ బయ్యర్లుగా కొనసాగుతున్నారు. బుధవారం నికరంగా రూ. 2,566 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.
  • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో 0.65 నుంచి 0.73కు పెరగ్గా.. విక్స్‌ 4.89 శాతం తగ్గి 15.75 వద్ద ఉంది.
  • క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.35 శాతం తగ్గి 62.63 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 31 పైసలు తగ్గి 85.90 వద్దకు చేరింది.
  • యూఎస్‌ డాలర్‌ ఇండెక్స్‌ 0.09 శాతం పెరిగి 98.88 కి, యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 0.30 శాతం పెరిగి 4.37 కు చేరాయి.
  • అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయి. రెసిప్రోకల్‌ టారిఫ్స్‌ విషయంలో యూఎస్‌ ఇచ్చిన మినహాయింపు గడువు సమీపిస్తోంది. ఇప్పటికీ ఈయూ మినహా మరే దేశమూ యూఎస్‌తో ట్రేడ్‌ డీల్స్‌ కుదుర్చుకోలేదు.
  • మన మార్కెట్లు గత మూడు వారాలుగా ఒకే రేంజ్‌లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 24,400 పాయింట్లనుంచి 25,080 పాయింట్ల రేంజ్‌లోనే తిరుగుతోంది. ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్‌ ఔట్‌పుట్‌ తర్వాత ఈ రేంజ్‌ నుంచి బయటపడే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.