అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pre Market Analysis : యూఎస్ టారిఫ్‌ల విషయంలో అనిశ్చితి(Tariff uncertainty) కొనసాగుతోంది. అయితే గత ట్రేడిరగ్ సెషన్‌లో యూఎస్, యూరోప్ మార్కెట్లు మాత్రం పాజిటివ్(Positive)గా ముగిశాయి. గురువారం ఉదయం జపాన్‌కు చెందిన నిక్కీ మినహా మిగతా ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో సాగుతున్నాయి.
Pre Market Analysis : యూఎస్ మార్కెట్లు(US markets)..
నాస్‌డాక్(Nasdaq) 0.94 శాతం, ఎస్‌అండ్‌పీ 0.61 శాతం పెరిగాయి. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.10 శాతం నష్టంతో కొనసాగుతోంది.
Pre Market Analysis : యూరోప్ మార్కెట్లు(European markets)..
సీఏసీ 1.42 శాతం, డీఏఎక్స్(DAX) 1.40 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.14 శాతం పెరిగాయి.
Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..
ఆసియా మార్కెట్లు గురువారం ఉదయం పాజిటివ్‌గా సాగుతున్నాయి. ఉదయం 8.15 గంటల సమయంలో కోస్పీ(Kospi) 1.09 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.43 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.37 శాతం, షాంఘై 0.27 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.37 శాతం, షాంఘై 0.27 శాతం, హంగ్‌సెంగ్ 0.07 శాతం లాభంతో ఉన్నాయి. నిక్కీ 0.51 శాతం నష్టంతో ఉంది. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) 0.10 శాతం లాభంతో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 77 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐ(DII)లు నికరంగా రూ. 920 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 1.04 నుంచి 0.89 కు తగ్గింది. విక్స్(VIX) 2.09 శాతం తగ్గి 11.94 వద్ద ఉంది. ఇది 13 నెలల కనిష్టం.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 70.02 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 4 పైసలు బలపడి 85.67 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.34 వద్ద, డాలర్ ఇండెక్స్ 97.32 వద్ద కొనసాగుతున్నాయి.
- 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభం కాబోతోంది. మొదటగా టీసీఎస్ Q1 రిజల్ట్స్ వెలువడనున్నాయి. కంపెనీ ఈరోజు ఫలితాలను వెలువరించనుంది.