ePaper
More
    Homeబిజినెస్​Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గా ఉన్నాయి. సోమవారం యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. శుక్రవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు సైతం ఎక్కువగా లాభాలతో సాగుతున్నాయి. అయితే ట్రంప్‌(Trump) బెదిరింపులతో గిఫ్ట్‌నిఫ్టీ మాత్రం నెగెటివ్‌గా ఉంది. రష్యానుంచి ఆయిల్‌ కొనుగోలు చేస్తే భారీగా సుంకాలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు బెదిరిస్తుండడంతో మన మార్కెట్లు ఫ్లాట్‌ టు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..

    Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    శుక్రవారం సెషన్‌లో భారీగా నష్టపోయిన వాల్‌స్ట్రీట్‌(Wallstreet) మళ్లీ పుంజుకుంది. సోమవారం నాస్‌డాక్‌ 1.95 శాతం, ఎస్‌అండ్‌పీ 1.47 శాతం లాభాలతో ముగిశాయి. మంగళవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.18 శాతం లాభంతో కొనసాగుతోంది.

    READ ALSO  Stock Market | లాభాలబాట పట్టిన స్టాక్‌ మార్కెట్లు

    Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    డీఏఎక్స్‌ 1.40 శాతం, సీఏసీ 1.12 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.65 శాతం మేర పెరిగాయి.

    Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ఆసియా మార్కెట్లు కూడా పాజిటివ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో కోస్పీ(Kospi) 1.26 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.77 శాతం, నిక్కీ 0.61 శాతం, షాంఘై 0.47 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.45 శాతం లాభంతో ఉన్నాయి. హంగ్‌సెంగ్‌ 0.24 శాతం నష్టాలతో ట్రేడ్‌ అవుతోంది. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.07 శాతం నష్టంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు ఫ్లాట్‌ టు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

    ఎఫ్‌ఐఐలు వరుసగా 11వ Trading సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా కొనసాగారు. నికరంగా రూ. 2,566 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. డీఐఐ(DII)లు వరుసగా 21వ Trading సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. నికరంగా రూ. 4,386 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.

    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.75 నుంచి 0.94కు పెరిగింది. విక్స్‌(VIX) 0.06 శాతం తగ్గి 11.97 వద్ద ఉంది.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.10 శాతం తగ్గి 68.69 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు బలహీనపడి 87.66 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.20 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 98.79 వద్ద కొనసాగుతున్నాయి.
    READ ALSO  Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Latest articles

    Trump Tariffs | భారత్‌పై ప‌న్నుల మోత త‌ప్ప‌దు.. ట్రంప్ హెచ్చ‌రిక‌.. అసంజ‌స‌మ‌న్న ఇండియా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Tariffs | రష్యా నుంచి చౌక‌గా చ‌మురు కొనుగోలు చేస్తుండ‌డాన్ని అమెరికా అధ్యక్షుడు...

    Weather Updates | నేడు రాష్ట్రానికి భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం (Heavy Rain)...

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ గా ప్రొఫెసర్ ఆరతి నియామకం

    అక్షరటుడే, డిచ్​పల్లి : Telangana University : తెయూకు ఇటీవల ఇంజినీరింగ్​ కళాశాల మంజూరైన విషయం తెలిసిందే. ఫలితంగా...

    Highway Infrastructure IPO | నేడు మరో ఐపీవో ప్రారంభం.. భారీ లాభాలను సూచిస్తున్న జీఎంపీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Highway Infrastructure IPO : స్టాక్ మార్కెట్‌ నుంచి నిధులు సమీకరించేందుకు మరో కంపెనీ ఐపీవో(IPO)కు...

    More like this

    Trump Tariffs | భారత్‌పై ప‌న్నుల మోత త‌ప్ప‌దు.. ట్రంప్ హెచ్చ‌రిక‌.. అసంజ‌స‌మ‌న్న ఇండియా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Tariffs | రష్యా నుంచి చౌక‌గా చ‌మురు కొనుగోలు చేస్తుండ‌డాన్ని అమెరికా అధ్యక్షుడు...

    Weather Updates | నేడు రాష్ట్రానికి భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం (Heavy Rain)...

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ గా ప్రొఫెసర్ ఆరతి నియామకం

    అక్షరటుడే, డిచ్​పల్లి : Telangana University : తెయూకు ఇటీవల ఇంజినీరింగ్​ కళాశాల మంజూరైన విషయం తెలిసిందే. ఫలితంగా...