More
    Homeబిజినెస్​Pre Market Analysis | ట్రంప్‌ ఎఫెక్ట్‌... నెగెటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న...

    Pre Market Analysis | ట్రంప్‌ ఎఫెక్ట్‌… నెగెటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : యూఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) వివిధ దేశాలపై విధించిన రెసిప్రోకల్‌ టారిఫ్స్‌ శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) వీక్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. గురువారం యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. శుక్రవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు ఎక్కువగా నష్టాలతో సాగుతున్నాయి.

    Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US Markets)..

    ట్రంప్‌ సుంకాల బాదుడు నేపథ్యంలో వాల్‌స్ట్రీట్‌((Wallstreet) ఇన్వెస్టర్లు సైతం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో గురువారం యూఎస్‌ మార్కెట్లు నెగెటివ్‌గా ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 0.37 శాతం, నాస్‌డాక్‌ 0.03 శాతం నష్టపోయాయి. శుక్రవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ ఫ్లాట్‌గా కొనసాగుతోంది.

    Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    సీఏసీ 1.16 శాతం, డీఏఎక్స్‌ 0.82 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 00.05 శాతం నష్టాలతో ముగిశాయి.

    Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో స్ట్రెయిట్స్‌ టైమ్స్‌(Straits times) 0.18 శాతం, షాంఘై 0.07 శాతం లాభంతో ఉన్నాయి. కోస్పీ 2.94 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.40 శాతం, నిక్కీ 0.38 శాతం, హంగ్‌సెంగ్‌ 0.18 శాతం నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.41 శాతం నష్టంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు భారీ గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

    • ఎఫ్‌ఐఐ(FII)లు వరుసగా తొమ్మిదో ట్రేడిరగ్‌ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా కొనసాగారు. నికరంగా రూ. 5,588 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. డీఐఐలు వరుసగా 19వ ట్రేడిరగ్‌ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. నికరంగా రూ. 6,372 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.
    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.87 నుంచి 1.04కు పెరిగింది. విక్స్‌(VIX) 3.01 శాతం పెరిగి 11.54 కు చేరింది.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.33 శాతం తగ్గి 71.57 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 16 పైసలు బలహీనపడి 87.60 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.39 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 100.09 వద్ద కొనసాగుతున్నాయి.

    More like this

    Nizamabad Collector | సాలూర తహశీల్దార్​ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్​

    అక్షరటుడే, బోధన్: Nizamabad Collector | సాలూరు మండల తహశీల్దార్​ కార్యాలయాన్ని కలెక్టర్ వినయ్​ కృష్ణారెడ్డి (Collector Vinay...

    ACB Raids | ఏడీఈ ఆస్తులు మాములుగా లేవుగా.. రూ.2 కోట్ల నగదు సీజ్​ చేసిన ఏసీబీ అధికారులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | విద్యుత్​ శాఖ ఏడీఈ అంబేడ్కర్ (ADE Ambedkar)​ ఇంట్లో ఏసీబీ...

    Maxivision Eye Hospital | అందుబాటులోకి మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్.. అప్పటి వరకు ఉచిత కన్సల్టెన్సీనే!

    అక్షరటుడే, హైదరాబాద్: Maxivision Eye Hospital | నేత్ర వైద్య రంగంలో ప్రఖ్యాత సంస్థ మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ...