ePaper
More
    Homeబిజినెస్​Global markets mood | జోరుమీదున్న గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Global markets mood | జోరుమీదున్న గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Global markets mood : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) జోరుమీదున్నాయి. అన్ని ప్రధాన మార్కెట్లు లాభాలతో ట్రేడ్‌ అవుతున్నాయి.

    వాల్‌స్ట్రీట్‌(Wallstreet) ఆల్‌టైం హైస్‌ వద్ద ముగియగా.. యూరోపియన్‌ మార్కెట్లు మాత్రం లాభాలతో ముగిశాయి. శుక్రవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు సైతం లాభాలతో సాగుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) సైతం పాజిటివ్‌గా ఉంది.

    Global markets mood : యూఎస్‌ మార్కెట్లు (US markets)..

    అమెరికాలో ఇన్ఫ్లెషన్‌ డాటా సానుకూలంగా రావడంతో యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయన్న అంచనాలు పెరిగిపోతున్నాయి. దీంతో గత సెషన్‌లో ఎస్‌అండ్‌పీ 0.85 శాతం, నాస్‌డాక్‌(Nasdaq) 0.72 శాతం పెరిగాయి. డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.02 శాతం నష్టంతో సాగుతోంది.

    Global markets mood : యూరోప్‌ మార్కెట్లు (European markets)..

    సీఏసీ 0.80 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.78 శాతం, డీఏఎక్స్‌ 0.30 శాతం లాభంతో ముగిశాయి.

    Global markets mood : ఆసియా మార్కెట్లు (Asian markets)..

    ఆసియా మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో హాంగ్‌సెంగ్‌(Hang Seng) 1.53 శాతం, కోస్పీ 1.31 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.75 శాతం, నిక్కీ 0.72 శాతం, షాంఘై 0.42 శాతం లాభంతో కొనసాగుతున్నాయి. స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.04 శాతం నష్టంతో ఉంది. గిఫ్ట్‌ నిఫ్టీ 0.33 శాతం లాభంతో ఉంది. దీంతో మన మార్కెట్లు ఈరోజు గ్యాప్‌ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    గమనించాల్సిన అంశాలు..

    ఎఫ్‌ఐఐలు రెండోరోజూ నికర అమ్మకందారులుగా కొనసాగారు. గత సెషన్‌లో నికరంగా రూ. 3,472 కోట్ల విలువైన స్టాక్స్‌ అమ్మారు. డీఐఐ(DII)లు పదమూడో రోజు నికరంగా రూ. 4,045 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.

    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 1.15 నుంచి 1.17 కు పెరిగింది. విక్స్‌(VIX) 1.68 శాతం తగ్గి 10.36 వద్ద ఉంది. పీసీఆర్‌ పెరగడం, విక్స్‌ తగ్గడం బుల్స్‌కు అనుకూలాంశం.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 65.93 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 34 పైసలు బలహీనపడి 88.45 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.03 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 97.62 వద్ద కొనసాగుతున్నాయి.
    • భారత్‌, యూఎస్‌ మధ్య వాణిజ్య ఒప్పందం(Trade deal) దిశగా అడుగులు పడుతున్నాయి. నవంబర్‌ నాటికి మొదటి దశ ఒప్పందం ఖరారయ్యే అవకాశాలున్నాయి.

    ఇన్ఫోసిస్‌ చరిత్రలో అతిపెద్ద బైబ్యాక్‌(Buy back)కు ఓకే చెప్పింది. దీని ప్రకారం రూ. 18 వేల కోట్ల విలువైన షేర్లను మార్కెట్‌ నుంచి కొనుగోలు చేయనుంది. 19 శాతం ప్రీమియంతో కొనుగోలు చేయనుంది. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ షేర్లు ర్యాలీ చేసే అవకాశాలున్నాయి.

    More like this

    SBI Notification | ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ కొలువులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : SBI Notification | బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌...

    Prices fallen drastically | కేజీ ఉల్లి రూ. 1.50.. టమాట రూ. 2.. భారీగా పడిపోయిన ధరలు.. ఎక్కడంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Prices fallen drastically : దేశమంతటా టమాట Tomato, ఉల్లి Onion ధరలు భగ్గుమంటుంటే.. ఆంధ్రప్రదేశ్...

    Vice President | ఉప రాష్ట్ర‌ప‌తిగా రాధాకృష్ణ‌న్ ప్ర‌మాణ స్వీకారం.. అభినందించిన రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President | భారతదేశ 15వ ఉప రాష్ట్ర‌ప‌తిగా చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ శుక్ర‌వారం...