Homeబిజినెస్​Stock market | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్న గిఫ్ట్‌ నిఫ్టీ

Stock market | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్న గిఫ్ట్‌ నిఫ్టీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌(Trump), ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ల మధ్య నెలకొన్న వివాదం స్టాక్‌ మార్కెట్లపైనా పడుతోంది. అమెరికా మార్కెట్లు నెగెటివ్‌లో క్లోజ్‌ కాగా.. ఆసియా మార్కెట్లు(Asia markets) మిక్స్‌డ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. ట్రంప్‌ విధానాలతో రెసిషన్‌ వస్తుందన్న భయాలతో సోమవారం వాల్‌స్ట్రీట్‌ నష్టాలను చవి చూసింది. ఎస్‌అండ్‌పీ(S&P) 2.36 శాతం నష్టంతో, నాస్‌డాక్‌ 2.55 శాతం నష్టంతో ముగిశాయి. డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌(Dow Jones Futures) మాత్రం 0.41 శాతం లాభంతో కదలాడుతోంది. యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లకు సోమవారం సెలవు.

Stock market | ఆసియా మార్కెట్లు..

ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌(Mixed)గా ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో స్ట్రేయిట్స్‌ టైమ్స్‌ 1.451 శాతం లాభంతో ఉండగా.. కోస్పీ(Kospi) 0.17 శాతం, షాంఘై 0.37 శాతం లాభంతో ఉన్నాయి. హంగ్‌సెంగ్‌ 0.19 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.98 శాతం, నిక్కీ 0.07 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gifty nifty) ఫ్లాట్‌గా కదలాడుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లూ ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Stock market | గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్‌ఐఐలు Monday నికరంగా రూ. 1,970 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. డీఐఐలు సైతం నికరంగా 246 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.
  • క్రూడ్‌(Crude) ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.69 శాతం పెరిగి 62.94 వద్ద ట్రేడ్‌ అవుతోంది.
  • డాలర్‌ ఇండెక్స్‌ 0.10 శాతం తగ్గి 98.12 వద్ద కొనసాగుతోంది.
  • యూఎస్‌ 10 ఇయర్స్‌ బాండ్‌ ఈల్డ్‌ 0.18 శాతం పెరిగి 4.41 వద్దకు చేరింది.
  • రూపాయి విలువ బలపడుతోంది. డాలర్‌తో 25 పైసలు పెరిగి 85.13 వద్ద ఉంది.