ePaper
More
    Homeబిజినెస్​Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా స్పందిస్తున్నాయి. గత Trading సెషన్‌లో యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు నష్టాలతో ముగియగా.. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కనిపిస్తున్నాయి.

    Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    ఎస్‌అండ్‌పీ 0.33 శాతం, నాస్‌డాక్‌(Nasdaq) 0.22 శాతం పడిపోయాయి. సోమవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.43 శాతం నష్టంతో కొనసాగుతోంది.

    Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    సీఏసీ(CAC) 0.93 శాతం, డీఏఎక్స్‌ 0.83 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.39 శాతం క్షీణించాయి.

    Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ఆసియా మార్కెట్లు సోమవారం ఉదయం మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో షాంఘై(Shanghai) 0.46 శాతం, కోస్పీ 0.26 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.33 శాతం, హంగ్‌సెంగ్‌ 0.14 శాతం లాభంతో ఉన్నాయి. తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.56 శాతం, నిక్కీ 0.25 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.03 శాతం నష్టంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు ఫ్లాట్‌ టు గ్యాప్‌డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    READ ALSO  Stock Market | హెవీవెయిట్‌ స్టాక్స్‌లో జోరు.. భారీ లాభాల్లో ప్రధాన సూచీలు

    Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

    • ఎఫ్‌ఐఐ(FII)లు నికరంగా రూ. 5,104 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు నికరంగా రూ. 3,558 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.
    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.97 నుంచి 0.76 కు తగ్గిది. విక్స్‌(VIX) 1.24 శాతం తగ్గి 11.82 వద్ద ఉంది.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.08 శాతం పెరిగి 70.42 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 14 పైసలు బలహీనపడి 85.79 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.41 వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 97.88 వద్ద కొనసాగుతున్నాయి.
    • యూఎస్‌, దాని వాణిజ్య భాగస్వామ్య దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతుండడం, Q1 ఎర్నింగ్‌ సీజన్‌ బలహీనంగా ప్రారంభం కావడంతో గతవారం స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
    • యూరోపియన్‌ యూనియన్‌(EU), మెక్సికో వంటి దేశాలనుంచి చేసుకునే దిగుమతులపై 30 శాతం అదనపు సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. దీంతో యూరోప్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
    • భారత్‌తో వీలైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం(Trade deal) కుదుర్చుకోవాలని యూఎస్‌ భావిస్తోంది. మన దేశంపై 20 శాతం లోపు అదనపు సుంకాలు ఉండే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
    • ముడి చమురు(Crude oil) ధరలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రష్యాపై అదనపు సుంకాలు విధించే యోచనలో అమెరికా ఉండడంతో క్రూడ్‌ ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి.
    READ ALSO  Pre Market Analysis | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Latest articles

    Fake Votes | న‌కిలీ ఓట్లు వేయ‌డానికి అనుమ‌తించాలా? ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌ల‌పై సీఈసీ అస‌హ‌నం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Fake Votes | బీహార్ ఎన్నిక‌ల ముంద‌ర చేప‌ట్టిన ఓటార్ జాబితాల స్పెష‌ల్ ఇంటెన్సివ్...

    BC Sankshema Sangham | 7న జాతీయ ఓబీసీ మహాసభ

    అక్షరటుడే, ఇందూరు: BC Sankshema Sangham | అఖిలభారత జాతీయ ఓబీసీ పదో మహాసభ (National OBC 10th...

    Shravana Masam | శ్రావణం.. శుభాలనొసగే వ్రతాల మాసం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Shravana Masam | స్థితికారుడు అయిన శ్రీమహావిష్ణువు(Shri Maha Vishnu)కు, ఆయన దేవేరి అయిన...

    Maharashtra | మ‌హిళా రిసెప్ష‌నిస్ట్‌పై రోగి బంధువు దాడి.. అలాంటోడిని వ‌ద‌లొద్దు అంటూ జాన్వీ క‌పూర్ ఫైర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maharashtra | మహారాష్ట్ర థానే జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన ఓ దారుణ...

    More like this

    Fake Votes | న‌కిలీ ఓట్లు వేయ‌డానికి అనుమ‌తించాలా? ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌ల‌పై సీఈసీ అస‌హ‌నం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Fake Votes | బీహార్ ఎన్నిక‌ల ముంద‌ర చేప‌ట్టిన ఓటార్ జాబితాల స్పెష‌ల్ ఇంటెన్సివ్...

    BC Sankshema Sangham | 7న జాతీయ ఓబీసీ మహాసభ

    అక్షరటుడే, ఇందూరు: BC Sankshema Sangham | అఖిలభారత జాతీయ ఓబీసీ పదో మహాసభ (National OBC 10th...

    Shravana Masam | శ్రావణం.. శుభాలనొసగే వ్రతాల మాసం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Shravana Masam | స్థితికారుడు అయిన శ్రీమహావిష్ణువు(Shri Maha Vishnu)కు, ఆయన దేవేరి అయిన...