Homeబిజినెస్​Pre market analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

Pre market analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pre market analysis | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా స్పందిస్తున్నాయి. వాల్‌ స్ట్రీట్‌లో బుల్‌ జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు కాస్త పాజిటివ్‌గా ఉన్నాయి. ఆసియా మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గత ట్రేడింగ్‌ సెషన్‌లో అమెరికాకు చెందిన నాస్‌డాక్‌(Nasdaq) 1.61 శాతం లాభపడగా… ఎస్‌అండ్‌ప 0.72 శాతం పెరిగింది. బుధవారం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ స్వల్ప లాభాలతో కొనసాగుతోంది.

లాభాల బాటలో యూరోప్‌ మార్కెట్లు

యూరోప్‌(Europe) మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. సీఏసీ, డీఏఎక్స్‌ 0.3 శాతం మేర పెరగ్గా.. ఎఫ్‌టీఎస్‌ఈ మాత్రం స్వల్ప నష్టాలతో ముగిసింది.

ఆసియా మార్కెట్లు..

ఆసియా(Asia) మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 1.35 శాతం, హంగ్‌సెంగ్‌(Hang Seng) 1 శాతం, కోస్పీ 1.19 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి. నిక్కీ 0.84 శాతం నష్టంతో ఉండగా.. స్ట్రెయిట్‌ టైమ్స్‌ 0.24 శాతం, షాంఘై 0.12 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ (Gift nifty)0.37 శాతం లాభంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్‌ఐఐ(FII)లు తిరిగి అమ్మకాల బాట పట్టారు. మంగళవారం నికరంగా రూ. 476 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు మాత్రం రూ. 4,273 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.
  • క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధర స్వల్పంగా తగ్గింది. బ్యారెల్‌కు 0.63 శాతం తగ్గి 63.45 డాలర్ల వద్ద ఉంది.
  • రూపాయి విలువ 5 పైసలు పెరిగి 85.33 వద్ద నిలిచింది.
  • డాలర్‌ ఇండెక్స్‌(Dollar index) 0.07 శాతం తగ్గి 100.93 వద్ద ఉంది.
  • ఇండియా విక్స్‌(VIX) 1.05 శాతం తగ్గి, 18.2కు చేరింది. ఇది మార్కెట్లలో స్థిరత్వాన్ని సూచిస్తుంది.
  • యూఎస్‌ ఇన్‌ఫ్లెషన్‌ మాత్రం స్వల్పంగా పెరిగింది. అయితే అంచనాల మేరకే నమోదయ్యింది. ఈ నేపథ్యంలో అమెరికాలో సెప్టెంబర్‌ వరకు వడ్డీ రేట్ల కోత ఉండకపోవచ్చని భావిస్తున్నారు.
  • భారత్‌(Bharath) రిటైల్‌ ఇన్‌ఫ్లెషన్‌ మాత్రం గతనెలలో గణనీయంగా తగ్గింది. అంతకుముందు నెలలో 3.34 శాతం ఉన్న సీపీఐ ఏప్రిల్‌లో 3.16 శాతానికి దిగి వచ్చింది. ఇది ఆరేళ్ల కనిష్టం.