అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pre Market Analysis : గ్లోబల్ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. మంగళవారం యూఎస్ మార్కెట్లు నెగెటివ్‌గా, యూరోప్ మార్కెట్లు లాభాలతో ముగియగా.. బుధవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా కొనసాగుతున్నాయి.
Pre Market Analysis : యూఎస్ మార్కెట్లు..
పలు కంపెనీల Q2 రిజల్ట్స్ నిరాశ పరచడం, ఫెడ్ మీటింగ్ నేపథ్యంలో గత ట్రేడిరగ్ సెషన్‌లో వాల్‌స్ట్రీట్ నష్టాలతో ముగిసింది. రికార్డు గరిష్టాలనుంచి సూచీలు పతనమయ్యాయి. నాస్‌డాక్(Nasdaq) 0.38 శాతం, ఎస్‌అండ్‌పీ 0.30 శాతం నష్టపోయాయి. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ సైతం 0.41 శాతం లాభంతో కొనసాగుతోంది.
Pre Market Analysis : యూరోప్ మార్కెట్లు..
యూరోప్ మార్కెట్లలో నష్టాలకు బ్రేక్ పడిరది. మంగళవారం డీఏఎక్స్(DAX) 1.02 శాతం, సీఏసీ 0.72 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.60 శాతం లాభాలతో ముగిశాయి.
Pre Market Analysis : ఆసియా మార్కెట్లు..
అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితులతో ప్రధాన ఆసియా మార్కెట్లు బుధవారం ఉదయం మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8.10 గంటల సమయంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.91 శాతం, కోస్పీ(Kospi) 0.72 శాతం, షాంఘై 0.55 శాతం లాభంతో ఉన్నాయి. హంగ్‌సెంగ్ 0.40 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.13 శాతం, నిక్కీ 0.03 శాతం నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.16 శాతం నష్టంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..
ఎఫ్‌ఐఐ(FII)లు వరుసగా ఏడో ట్రేడిరగ్ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా కొనసాగారు. నికరంగా రూ. 4,636 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. డీఐఐలు వరుసగా 17వ ట్రేడిరగ్ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. నికరంగా రూ. 920 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.64 నుంచి 0.80కు పెరిగింది. విక్స్(VIX) 4.46 శాతం తగ్గి 11.53 కి చేరింది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.19 శాతం పెరిగి 72.65 డాలర్ల వద్ద ఉంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 14 పైసలు బలహీనపడి 86.81 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.33 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 98.78 వద్ద కొనసాగుతున్నాయి.
యూఎస్, చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం(Trade deal) విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో రెసిప్రోకల్ టారిఫ్స్‌ను మరో 90 రోజులు వాయిదా వేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
భారత్‌నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 25 శాతం వరకు సుంకాలు విధించే ఆలోచనలో అమెరియా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారు.