ePaper
More
    Homeబిజినెస్​Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : వాణిజ్య ఒప్పందాల(Trade agreement) విషయంలో వివిధ దేశాలకు ఆగస్టు ఒకటో తేదీ వరకు ఇచ్చిన గడువే తుది గడువని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌(Trump) పేర్కొన్నారు. దీంతో మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. యూఎస్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవగా.. యూరోప్‌ మార్కెట్లు పాజిటివ్‌గా సాగాయి. బుదవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి.

    Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    నాస్‌డాక్‌(Nasdaq) 0.01 శాతం పెరగ్గా.. ఎస్‌అండ్‌పీ 0.07 శాతం తగ్గింది. బుధవారం ఉదయం డౌజోన్స్‌ 0.02 శాతం నష్టంతో కొనసాగుతోంది.

    Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    సీఏసీ 0.56 శాతం, డీఏఎక్స్‌(DAX) 0.55 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.54 శాతం పెరిగాయి.

    Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ఆసియా మార్కెట్లు సోమవారం ఉదయం Mixedగా సాగుతున్నాయి. ఉదయం 8.15 గంటల సమయంలో షాంఘై(Shanghai) 0.35 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.25 శాతం, కోస్పీ 0.17 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.05 శాతం లాభంతో ఉన్నాయి. హంగ్‌సెంగ్‌ 0.69 శాతం, నిక్కీ 0.03 శాతం నష్టంతో ఉంది. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.06 శాతం నష్టంతో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు ఫ్లాట్‌ టు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

    • ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 26 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐ(DII)లు నికరంగా రూ. 1,366 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.
    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.95 నుంచి 1.04 కు పెరిగింది. విక్స్‌(VIX) 2.91 శాతం తగ్గి 12.20 వద్ద ఉంది. అక్టోబర్‌ తర్వాత కనిష్ట స్థాయి ఇదే.. విక్స్‌ తగ్గడం బుల్స్‌కు అనుకూలాంశం.
    • బ్రెంట్‌ క్రూడ్‌(Brent crude) ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 70.02 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 17 పైసలు బలపడి 85.70 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.41 వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 97.57 వద్ద కొనసాగుతున్నాయి.
    • యూఎస్‌, భారత్‌ల మధ్య మినీ ట్రేడ్‌ డీల్‌(Mini trade deal)పై ఇంకా స్పష్టత రాలేదు.

    ఆగస్టు ఒకటో తేదీనుంచి ప్రారంభం కానున్న రెసిప్రోకల్‌ టారిఫ్స్‌పై గడువును పొడిగించడానికి యూఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిరాకరించడంతో ఆసియా మార్కెట్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. యూఎస్‌ వాణిజ్య విధానంపై స్పష్టత లేకపోవడంతో అక్కడి ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణితో వ్యవహరించారు. దీంతో గత Trading సెషన్‌లో యూఎస్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి.

    More like this

    CM Revanth Reddy | ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్​కు తాగునీరు.. కేటీఆర్​కు సీఎం కౌంటర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​కు సీఎం రేవంత్​రెడ్డి...

    Baswa laxmi narsaiah | కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బస్వా లక్ష్మీ నర్సయ్య

    అక్షరటుడే, ఇందూరు: Baswa laxmi narsaiah | భారతీయ జనతా పార్టీ (Bharatiya Janatha Party) ఆయా మోర్చాల...

    Speed guns | వాహనాల వేగాన్ని నియంత్రించేందుకే స్పీడ్ గన్స్

    అక్షరటుడే, కామారెడ్డి: Speed guns | వాహనాల వేగాన్నికట్టడి చేసేందుకు స్పీడ్​ లేజర్​ గన్స్​ వాడుతున్నామని కలెక్టర్ ఆశిష్...