ePaper
More
    Homeబిజినెస్​Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్ల(Global markets)లో పాజిటివ్‌ మూడ్‌ కొనసాగుతోంది. శుక్రవారం యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సోమవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా కొనసాగుతున్నాయి.

    Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    చివరి ట్రేడింగ్‌ సెషన్‌లో నాస్‌డాక్‌(Nasdaq), ఎస్‌అండ్‌పీ 0.52 శాతం మేర లాభపడ్డాయి. సోమవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.51 శాతం లాభంతో కొనసాగుతోంది.

    Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    శుక్రవారం యూరొపియన్‌ మార్కెట్లు భారీ లాభాలను ఆర్జించాయి. సీఏసీ(CAC) 1.75 శాతం, డీఏఎక్స్‌ 1.6 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.72 శాతం పెరిగాయి.

    Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ఆసియా మార్కెట్లు సోమవారం ఉదయం మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. ఉదయం 7.50 గంటల సమయంలో నిక్కీ(Nikkei) 1.67 శాతం, కోస్పీ 0.98 శాతం, షాంఘై 0.11 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.04 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి. హంగ్‌సెంగ్‌ 0.78 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.37 శాతం నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.07 శాతం నష్టంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు ఫ్లాట్‌ టు గ్యాప్‌ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

    ఎఫ్‌ఐఐ(FII)లు వరుసగా రెండో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ నెట్‌ బయ్యర్లుగా నిలిచారు. శుక్రవారం వారు నికరంగా రూ. 1,397 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. డీఐఐలు వరుసగా రెండో Trading సెషన్‌లోనూ నెట్‌ సెల్లర్లుగా ఉన్నారు. నికరంగా రూ. 588 కోట్ల విలువైన స్టాక్స్‌ అమ్మారు. ఏప్రిల్‌ 24 తర్వాత వరుసగా రెండు రోజులు నికర అమ్మకందారులుగా ఉండడం ఇదే తొలిసారి.

    నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 1.28 నుంచి 1.25కి తగ్గింది. విక్స్‌(VIX) మరింత తగ్గింది. శుక్రవారం 1.61 శాతం తగ్గి 12.39 వద్ద ఉంది. అక్టోబర్‌ 1 తర్వాత ఇదే అత్యల్ప స్థాయి. ఇది బుల్స్‌కు మరింత అనుకూల వాతావరణాన్ని సూచిస్తోంది.

    బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.88 శాతం తగ్గి 64.93 డాలర్ల వద్ద ఉంది.

    డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 23 పైసలు బలపడి 85.48 వద్ద ఉంది.

    యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 0.07 శాతం తగ్గి 4.28 వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 0.21 శాతం తగ్గి 97.20 వద్ద కొనసాగుతున్నాయి.

    ఓవైపు ఇరాన్‌, ఇజ్రాయిల్‌ మధ్య జియో పొలిటికల్‌ టెన్షన్స్‌(Geo political tensions) తగ్గగా.. మరోవైపు యూఎస్‌ టారిఫ్స్‌ భయాలు మొదలయ్యాయి. ట్రేడ్‌ డీల్స్‌కు వివిధ దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇచ్చిన గడువు జూలై 9 తో ముగియనుంది. ఇంకా చాలా దేశాలతో యూఎస్‌కు ట్రేడ్‌ డీల్స్‌ కుదరలేదు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ఎలా స్పందిస్తారోనన్న అంశంపై మార్కెట్లు ప్రభావితం కానున్నాయి.

    యూఎస్‌, చైైనాల మధ్య ట్రేడ్‌ deal కుదిరినట్లు ట్రంప్‌ ప్రకటించారు. భారత్‌తోనూ భారీ ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

    మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గడం, ఆగస్టులో ఒపెక్‌(OPEC) ఉత్పత్తి పెంచుతుందన్న అంచనాలతో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇది భారత్‌ వంటి చమురు ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాలకు అనుకూలం.

    More like this

    Super Six | “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి .. ఎవ‌రెవ‌రు హాజ‌రు కానున్నారంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Super Six | కూటమి ప్రభుత్వం ఏర్పాటు అనంతరం తొలిసారిగా అధికార పక్షం ఆధ్వర్యంలో...

    Basketball Selections | రేపు బాస్కెట్​బాల్ సబ్ జూనియర్​​ క్రీడాకారుల ఎంపికలు

    అక్షరటుడే, ఇందూరు : Basketball Selections | జిల్లా బాస్కెట్​బాల్​ అసోసియేషన్(District Basketball Association) ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సబ్...

    Moneylenders | బడా వడ్డీ వ్యాపారులపై చర్యలేవి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Moneylenders | వడ్డీ వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని నిజామాబాద్​ కమిషనరేట్​ పోలీసులు (Nizamabad...