అక్షరటుడే, వెబ్‌డెస్క్: Global markets indicates | గ్లోబల్ మార్కెట్లు(Global markets) నష్టాలతో సాగుతున్నాయి. గత సెషన్‌లో యూఎస్, యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో ముగియగా.. బుధవారం ఉదయం ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) మాత్రం పాజిటివ్‌గా ఉంది.
Global markets indicates | యూఎస్ మార్కెట్లు (US markets)..
కీలకమైన వడ్డీ రేట్ల విషయంలో యూఎస్ ఫెడ్(US Fed) నిర్ణయాన్ని ప్రకటించే సమయం సమీపించడంతో వాల్‌స్ట్రీట్(Wallstree) ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.
దీంతో గత సెషన్‌లో ఎస్‌అండ్‌పీ 0.13 శాతం, నాస్‌డాక్ 0.07 శాతం నష్టపోయాయి. డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 0.07 శాతం లాభంతో సాగుతోంది.
Global markets indicates | యూరోప్ మార్కెట్లు (European markets)..
యూరోపియన్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. డీఏఎక్స్ 1.80 శాతం, సీఏసీ 1.01 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.88 శాతం నష్టపోయాయి.
Global markets indicates | ఆసియా మార్కెట్లు (Asian markets)..
యూఎస్ ఫెడ్ మీటింగ్ నేపథ్యంలో వాల్‌స్ట్రీట్ నష్టాలతో ముగియగా.. బుధవారం ఉదయం ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. ఉదయం 7.50 గంటల సమయంలో హాంగ్‌సెంగ్(Hang Seng) 0.82 శాతం, నిక్కీ 0.16 శాతం లాభంతో కొనసాగుతున్నాయి.
కోస్పీ 0.99 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.33 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.29 శాతం, షాంఘై 0.15 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.20 శాతం లాభంతో ఉంది. దీంతో మన మార్కెట్లు ఈరోజు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
ఎఫ్‌ఐఐ(FII)లు గత సెషన్‌లో నికరంగా రూ. 308 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. డీఐఐలు వరుసగా పదహారో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో రూ. 1,518 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 1.08 నుంచి 1.29 కు పెరిగింది. విక్స్(VIX) 1.2 శాతం తగ్గి 10.27 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 68.39 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 15 పైసలు బలపడి 88.06 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.03 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 96.72 వద్ద కొనసాగుతున్నాయి.
యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించవచ్చన్న అంచనాలతోపాటు భారత్, యూఎస్‌ల మధ్య ట్రేడ్ డీల్(Trade deal) విషయమై ఆశలు చిగురించడంతో గత సెషన్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి.
మంగళవారం యూఎస్, భారత్ మధ్య వాణిజ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలు సకారాత్మకంగా సాగాయని ఇరు దేశాల ప్రతినిధులు పేర్కొన్నారు.