Homeబిజినెస్​Gift Nifty | నష్టాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

Gift Nifty | నష్టాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gift Nifty | యూఎస్‌(US), యూరోప్‌ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. బుధవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ సైతం నెగెటివ్‌ ఉంది.

యూఎస్‌ మార్కెట్లు : ట్రంప్‌ విధించిన సుంకాల(Trump Tariffs)లో అత్యధికం చట్ట విరుద్ధమని అమెరికా ఫెడరల్‌ అప్పీల్‌ కోర్ట్‌ పేర్కొన్న నేపథ్యంలో వాల్‌స్ట్రీట్‌లో ఒత్తిడి నెలకొంది. గత ట్రేడింగ్ సెషన్‌(Trading Session)లో నాస్‌డాక్‌ 0.82 శాతం, ఎస్‌అండ్‌పీ 0.69 శాతం నష్టపోయాయి. డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ సైతం 0.24 శాతం నష్టంతో సాగుతోంది.

యూరోప్‌ మార్కెట్లు : డీఏఎక్స్‌ 2.34 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.87 శాతం, సీఏసీ 0.70 శాతం నష్టంతో ముగిశాయి.

ఆసియా మార్కెట్లు : ఆసియా మార్కెట్లు సోమవారం ఉదయం మిక్స్‌డ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం 8.10 గంటల సమయంలో కోస్పీ(Kospi) 0.32 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.26 శాతం లాభాలతో ఉండగా.. షాంఘై(Shanghai) 0.99 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.33 శాతం, నిక్కీ 0.32 శాతం, హాంగ్‌సెంగ్‌ 0.15 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ 0.11 శాతం నష్టంతో ఉంది. దీంతో మన మార్కెట్లు ఈ రోజూ గ్యాప్‌ డౌన్‌లో లేదా ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు : ఎఫ్‌ఐఐలు వరుసగా ఏడోరోజూ నికర అమ్మకందారులుగా నిలిచారు. గత ట్రేడింగ్ సెషన్‌లో నికరంగా రూ. 1,159 కోట్ల విలువైన స్టాక్స్‌ అమ్మారు. డీఐఐ(DII)లు ఆరో రోజూ నికరంగా రూ. 2,549 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.

  • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 1.14 నుంచి 0.99 కి పడిపోయింది. విక్స్‌(VIX) 0.95 శాతం తగ్గి పెరిగి 11.40 వద్ద ఉంది.
  • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.08 శాతం తగ్గి 69.06 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 05 పైసలు బలపడి 88.16 వద్ద నిలిచింది.
  • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.28 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 98.45 వద్ద కొనసాగుతున్నాయి.
  • ప్రపంచవ్యాప్తంగా బాండ్‌ ఈల్డ్స్‌(Bond yeilds) పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వాణిజ్య పరిణామాలను అంచనా వేస్తూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
  • ఈనెల 17న యూఎస్‌ ఫెడ్‌(US Fed) మీటింగ్‌ ఉంది. వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్లు కట్‌ చేసే అవకాశాలున్నాయని మార్కెట్‌ అంచనా వేస్తోంది. ఫెడ్‌ తీసుకునే నిర్ణయం, ఇచ్చే కామెంటరీ కోసం ఇన్వెస్టర్లు వేచి ఉన్నారు. శుక్రవారం విడుదలయ్యే యూఎస్‌ జాబ్‌ డాటాపై ఫెడ్‌ నిర్ణయం ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు.