ePaper
More
    Homeబిజినెస్​Global market Analysis | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Global market Analysis | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Global market Analysis : యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు(Europe markets) సోమవారం లాభాలతో ముగిశాయి. మంగళవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ సైతం పాజిటివ్‌గా ఉంది.

    Global market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలతో వాల్‌స్ట్రీట్‌ కోలుకుంది. గత ట్రేడింగ్ సెషన్‌లో నాస్‌డాక్‌(Nasdaq) 0.45 శాతం, ఎస్‌అండ్‌పీ 0.21 శాతం పెరిగాయి. డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ సైతం 0.09 శాతం లాభంతో సాగుతోంది.

    Global market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    డీఏఎక్స్‌(DAX) 0.88 శాతం, సీఏసీ 0.78 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.14 శాతం లాభంతో ముగిశాయి.

    Global market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ఆసియా మార్కెట్లు సోమవారం ఉదయం మిక్స్‌డ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో హాంగ్‌సెంగ్‌(Hang Seng) 1.25 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 1.16 శాతం, కోస్పీ 0.85 శాతం, నిక్కీ 0.08 శాతం, షాంఘై 0.01 శాతం లాభంతో కొనసాగుతున్నాయి.

    స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.27 శాతం నష్టంతో ఉంది. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.21 శాతం లాభంతో ఉంది. దీంతో మన మార్కెట్లు ఈ రోజు గ్యాప్‌ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

    గమనించాల్సిన అంశాలు..

    ఎఫ్‌ఐఐలు వరుసగా పదకొండో రోజూ నికర అమ్మకందారులుగా నిలిచారు. గత ట్రేడింగ్ సెషన్‌లో నికరంగా రూ. 2,170 కోట్ల విలువైన స్టాక్స్‌ అమ్మారు. డీఐఐ(DII)లు పదో రోజూ నికరంగా రూ. 3,014 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.

    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో Nifty Putcall Ratio (PCR) 0.86 నుంచి 0.95 కు పెరిగింది. విక్స్‌(VIX) 0.53 శాతం పెరిగి 10.84 వద్ద ఉంది.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 66.35 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 88.26 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.05 శాతం వద్ద, డాలర్‌(Dollar) ఇండెక్స్‌ 97.34 వద్ద కొనసాగుతున్నాయి.

    దేశంలోని పరిస్థితులు, డాటా వృద్ధికి అనుకూలంగా ఉన్నా యూఎస్‌ టారిఫ్‌ల విషయంలో అనిశ్చితి కొనసాగుతుండడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

    కనిష్టాల వద్ద కొనుగోళ్లు చేస్తూ గరిష్టాల వద్ద ప్రాఫిట్‌ బుక్‌ చేసుకుంటున్నారు. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ రేంజ్‌ బౌండ్‌లోనే కొనసాగుతోంది. అమెరికా సుంకాల విషయంలో స్పష్టత వస్తే మార్కెట్‌ ముందుకు కదిలే అవకాశాలుంటాయని అనలిస్టులు భావిస్తున్నారు.

    More like this

    Maggari Hanmandlu | బీఆర్​ఎస్​కు షాక్​.. పార్టీకి సొసైటీ ఛైర్మన్​ రాజీనామా

    అక్షరటుడే, బోధన్​: Maggari Hanmandlu | జిల్లాలో బీఆర్​ఎస్ (Brs Nizamabad)​ పార్టీలో తొలి రాజీనామా నమోదైంది.  కేసీఆర్​...

    Nepal PM Resigns | నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal PM Resigns | నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి...

    Best Teacher Award | నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి

    అక్షరటుడే, ఇందూరు : Best Teacher Award | విద్యార్థులకు కేవలం మార్కులు, ర్యాంకుల చదువులు కాకుండా.. నైతిక...