అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Domestic stock markets) లాభాల బాటలో పయనిస్తున్నాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్, నిఫ్టీ(Nifty)లు ఫ్లాట్‌గా ప్రారంభమైనా క్రమంగా పైకి ఎగబాకాయి. సెన్సెక్స్ 83,197 నుంచి 83,737 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,503 నుంచి 25,651 పాయింట్ల మధ్యలో కదలాడుతున్నాయి.
ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(Sensex) 511 పాయింట్ల లాభంతో 83,728 వద్ద, నిఫ్టీ 153 పాయింట్ల లాభంతో 25,646 వద్ద ఉన్నాయి. ఐటీ రంగ షేర్లు దూకుడు మీదున్నాయి. ఇన్ఫోసిస్(Infosys), హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ వంటి స్టాక్స్ బెంచ్‌మార్క్ సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి. లార్జ్, మిడ్ క్యాప్(Mid cap) స్టాక్స్ రాణిస్తుండగా.. స్మాల్ క్యాప్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. నేషనల్ అల్యూమినియం కంపెనీ 8 శాతానికిపైగా పెరిగింది.
Stock Markets | ఐటీలో దూకుడు..
ఐటీ(IT) రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతు కనిపిస్తోంది. బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్ 1.98 శాతం పెరగ్గా.. క్యాపిటల్ గూడ్స్ 0.78 శాతం, మెటల్ ఇండెక్స్ 0.69 శాతం, ఇండస్ట్రియల్ 0.66 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.61 శాతం, ఎనర్జీ 0.44 శాతం, క్యాపిటల్ మార్కెట్ 0.43 శాతం లాభాలతో ఉన్నాయి. పీఎస్‌యూ బ్యాంక్(PSU bank) ఇండెక్స్ 0.40 శాతం, హెల్త్‌కేర్ ఇండెక్స్ 0.09 శాతం నష్టంతో సాగుతున్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.21 శాతం నష్టంతో ఉండగా.. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.50 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.49 శాతం లాభంతో ఉన్నాయి.
Stock Markets | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 22 కంపెనీలు లాభాలతో ఉండగా.. 8 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఇన్ఫోసిస్ 2.0 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.99 శాతం, టీసీఎస్ 1.63 శాతం, ఆసియా పెయింట్ 1.41 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.29 శాతం లాభాలతో ఉన్నాయి.
Stock Markets | Top losers..
ట్రెంట్ 6.55 శాతం, పవర్‌గ్రిడ్ 0.68 శాతం, ఎంఅండ్‌ఎం 0.50 శాతం, టాటా స్టీల్ 0.50 శాతం, ఎటర్నల్ 0.31 శాతం నష్టాలతో ఉన్నాయి.
