అక్షరటుడే, వెబ్‌డెస్క్: POK as Guru Dakshina : భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది(Indian Army Chief General Upendra Dwivedi), తన సతీమణితో కలిసి చిత్రకూట్ (Chitrakoot)లోని జగద్గురు స్వామి రామభద్రాచార్యు(Jagadguru Swami Ramabhadracharya)ల తులసీ పీఠం(Tulsi Peeth) సందర్శించారు. అక్కడ రామభద్రాచార్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. కాంచ్ ఆలయంలో స్వామి రామభద్రాచార్యుల చేతుల మీదుగా దీక్ష అందుకున్నారు.
హెలికాప్టర్(helicopter)లో ఆర్మీ చీఫ్ చిత్రకూట్‌లోని కాంచ్ ఆలయానికి వెళ్లారు. అక్కడి తులసీ పీఠంలో స్వామి రామభద్రాచార్యను కలిశారు. దివ్యాంగ విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. యోగా, సంగీత ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగ విద్యార్థులను ఆర్మీ చీఫ్ ద్వివేది అభినందించి బహుమతులు అందజేశారు.

స్వామి చేతుల మీదుగా ఆర్మీ చీఫ్ దీక్ష తీసుకున్నారు. ఈ సందర్భంగా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)(Pakistan Occupied Kashmir - PoK)ను తనకు గురు దక్షిణ(Guru Dakshina)గా ఇవ్వాలని ఆర్మీ చీఫ్‌ను స్వామి రామభద్రాచార్య కోరారు.
2016 తర్వాత భారత సైన్యం నియంత్రణ రేఖ(Line of Control)ను దాటి పాక్‌పై దాడి చేసిందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Congress MP Shashi Tharoor) చేసిన వ్యాఖ్యలపై స్వామిజీ స్పందించారు. శశిథరూర్ చెప్పింది నిజమేనని తెలిపారు. శశిథరూర్ అనుభవజ్ఞుడైన నాయకుడని అన్నారు. ఆయన చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నానని చెప్పారు.