- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిTenth Results | పది ఫలితాల్లో బాలికలదే పైచేయి..

Tenth Results | పది ఫలితాల్లో బాలికలదే పైచేయి..

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​/కామారెడ్డి: 10Th Results | పది ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో బాలికలే పైచేయి సాధించారు. బుధవారం పది ఫలితాలు విడదల కాగా.. రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా​ 16వ స్థానం, కామారెడ్డి 20వ స్థానంలో నిలిచింది. గతంతో పోలిస్తే ఉభయ జిల్లాల ర్యాంకులు తగ్గాయి.

Tenth Results | నిజామాబాద్​ జిల్లాలో..

నిజామాబాద్​ జిల్లా గతేడాది కంటే రెండు స్థానాలు తగ్గినప్పటికీ.. మూడుశాతం విద్యార్థులు అధికంగా ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో మొత్తం 22,694 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 21,928 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 11,433 మందికి గాను 10,975 మంది (95.99 శాతం), బాలికలు 11,261 మందికి గాను 10,953 మంది (97.26) ఉత్తీర్ణత సాధించారు. అయితే గతేడాది జిల్లా 93 శాతం ఉత్తీర్ణతతో 14వ స్థానంలో ఉంది.

- Advertisement -

Tenth Results | కామారెడ్డిలో..

జిల్లా వ్యాప్తంగా మొత్తం 12542 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 6,128 మంది బాలురు, 6,414 మంది బాలికలు ఉన్నారు. మొత్తం 11,871 మంది విద్యార్థులు పది పరీక్షల్లో పాస్ కాగా అందులో 5,716 మంది బాలురు, 6,155 మంది బాలికలు ఉన్నారు. బాలుర ఉత్తీర్ణత శాతం 93.28 ఉండగా.. బాలికల ఉత్తీర్ణత శాతం 94.65గా నమోదైంది. జిల్లావ్యాప్తంగా 94.65 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News