HomeతెలంగాణInter Results | ఇంటర్​ ఫలితాల్లో బాలికలదే పైచేయి..

Inter Results | ఇంటర్​ ఫలితాల్లో బాలికలదే పైచేయి..

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు:Inter Results | ఇంటర్​ పరీక్ష ఫలితాలు(Inter Results) మంగళవారం విడుదలయ్యాయి. ఈసారి కూడా మొదటి(First year), ద్వితీయ సంవత్సరం(Second Year)లో బాలికలే పైచేయి సాధించారు.

నిజామాబాద్​ జిల్లాలో nizamabad district inter results సెకండియర్ పరీక్షల్లో మొత్తం 13,945 మంది హాజరుకాగా 8,117 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలు 5,309 మంది, బాలురు 2808 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఒకేషనల్(Occasional) లో మొత్తం 2,042 మంది విద్యార్థుల పరీక్షలు రాయగా, 1,231 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 666 మంది, బాలురు 565 మంది ఉత్తీర్ణత సాధించారు.

Inter Results | ఫస్టియర్​లో..

ఫస్టియర్​లో మొత్తం 15,056 మంది విద్యార్థులు (Students) పరీక్షలు రాయగా.. 8,035మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలు 5,191 మంది, బాలురు 2,844 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే వోకేషనల్(Occasional course) విద్యార్థులు మొత్తం 2,790 మంది పరీక్షలు రాయగా 1,223 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 756 మంది బాలురు 467 మంది పాసయ్యారు.

Inter Results | కామారెడ్డి జిల్లాలో..

ఇంటర్​ ఫలితాల్లో కామారెడ్డిలోనూ బాలికలే పైచేయి సాధించారు. ఫస్టియర్​లో బాలురు 36.91 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలికలు 61.49 శాతం పాసయ్యారు. సెకండియర్​లో బాలురు 43.83 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలికలు 67.24 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్టియర్​లో 8,740 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 4,378 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 1,496 మంది బాలురు, 2,882 మంది బాలికలు ఉన్నారు. ఇంటర్ సెకండియర్​లో 7,722 మంది విద్యార్థులకు గాను 4,354 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా ఫస్టియర్​లో 50.09 శాతం, సెకండియర్​లో 56.38 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Inter Results | ఒకేషనల్ పరీక్షల్లో..

ఇంటర్ ఫస్టియర్​ వొకేషనల్ పరీక్షలకు 1,912 మంది హాజరుకాగా.. 1,05 మంది పాసయ్యారు. ఇందులో 322 మంది బాలురు, 708 మంది బాలికలు ఉన్నారు. ఇంటర్ సెకండియర్​ ఒకేషనల్​లో మొత్తం 1,237కు గాను 792 మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా ఇందులో 222 మంది బాలురు, 570 బాలికలున్నారు.

Must Read
Related News