HomeతెలంగాణKukatpally | క్రికెట్​ బ్యాట్​ కోసమే బాలిక హత్య.. వివరాలు వెల్లడించిన పోలీసులు

Kukatpally | క్రికెట్​ బ్యాట్​ కోసమే బాలిక హత్య.. వివరాలు వెల్లడించిన పోలీసులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kukatpally | హైదరాబాద్​లోని కూకట్​పల్లి ఈ నెల 18న సహస్ర అనే బాలిక హత్య జరిగిన విషయం తెలిసిందే. పదో తరగతి చదువుతున్న ఓ బాలుడు ఆమెను హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు బాలుడిని ఇప్పటికే అరెస్ట్​ చేశారు.

శనివారం సీపీ మహంతి (CP Mahanti) కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. బాలుడు నెల క్రితమే ఇంట్లో చోరీకి ప్లాన్​ చేశాడు. బ్యాట్ కోసమే బాలిక ఇంటికి వెళ్లానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నిసార్లు అడిగినా డబ్బు గురించి చెప్పడం లేదన్నారు. బ్యాట్‌ తీసుకొని వెళ్తుండగా బాలిక అడ్డుకోవడంతో హత్య చేసి పారిపోయాడు. క్రైమ్​ సిరీస్​లు చూసే అలవాటు ఉన్న ఆ బాలుడు పోలీసులను తప్పుదారి పట్టించాడని సీపీ తెలిపారు. తమ విచారణలో బాలుడు నేరం ఒప్పుకున్నాడన్నారు. తనిఖీల్లో బాలుడి లేఖ, కత్తి దొరికిందని బాలానగర్​ డీసీపీ సురేష్​కుమార్​(Balanagar DCP Suresh Kumar) వెల్లడించారు.

Kukatpally | అన్ని ఆధారాలు లభించాయి

సహస్రను ఆ బాలుడే హత్య చేసినట్లు అన్ని ఆధారాలు లభించాయని సీపీ అవినాష్​ మహంతి తెలిపారు. దొంగతనానికి సంబంధించిన మొత్తం ప్లాన్‌ను ఓ పేపర్​లో రాసుకున్నట్లు చెప్పారు. క్రికెట్ బ్యాట్ (Cricket Bat) విషయంలో నిందితుడు గతంలో సహస్ర తమ్ముడితో గొడవ పడ్డాడన్నారు. ఈ క్రమంలో బ్యాట్​ చోరీ చేయడానికి వచ్చి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. యూట్యూబ్‌లో క్రైమ్ సీన్స్ చూసి హత్య ఎలా చేయాలో నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. హత్య చేసిన తర్వాత ఆధారాలు మాయం చేయడం సైతం నేర్చుకోవడం గమనార్హం. విచారణ సమయంలో క్రిమినల్ ఇంటెలిజెన్స్​గా వ్యవహరించిన బాలుడు పోలీసులను సైతం తప్పుదోవ పట్టించాడు.

Kukatpally | కఠినంగా శిక్షించాలి

తన కూతురికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని సహస్ర తండ్రి అన్నారు. తన బిడ్డను చంపిన వాడిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్​ చేశారు. తన కుమారుడితో క్రికెట్​ ఆడడానికి వచ్చే ఆ బాలుడికి ఇంత క్రిమినల్ మైండ్ ఉందని ఊహించలేదన్నారు. ఇంత దారుణం తర్వాత కూడా తమ ఇంటికి వచ్చాడంటే, ఎంత క్రూరమైన ఆలోచన ఉందో అర్థం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.