Homeజిల్లాలునిజామాబాద్​Balkonda | కుక్కకాటుతో చికిత్స పొందుతూ బాలిక మృతి.. విద్యార్థుల సంతాపం

Balkonda | కుక్కకాటుతో చికిత్స పొందుతూ బాలిక మృతి.. విద్యార్థుల సంతాపం

పెంపుడు కుక్క దాడిలో బాల్కొండకు ఓ బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో బాలిక చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -

అక్షరటుడే, బాల్కొండ: Balkonda | మండల కేంద్రానికి చెందిన గడ్డం లక్షిత(10) అనే బాలిక ఇటీవల కుక్కదాడిలో (Dog bite) తీవ్రంగా గాయపడింది. ఆమెకు హైదరాబాద్‌లోని (Hyderabad) ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించగా శనివారం మృతి చెందింది.

కాగా.. బాల్కొండలోని కృష్ణవేణి ప్రైవేట్‌ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. విద్యార్థిని మృతికి సంతాపంగా పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు శనివారం శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు.

పెంపుడు జంతువులు, వీధి కుక్కలతో జాగ్రత్తగా ఉండాలని పాఠశాల డైరెక్టర్‌ విఘ్నేష్, ప్రిన్సిపాల్‌ విజయ్‌ కర్తన్‌ విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో పాఠశాల పర్యవేక్షకుడు రాజేందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.