అక్షరటుడే, నిజామాబాద్ జిల్లా : Nizamabad | బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామా బాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో (Dichpally Mandal) చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.
డిచ్పల్లి మండలంలోని (Korat Palli Thanda) ఓ గ్రామానికి చెందిన బాలిక అదే గ్రామానికి చెందిన బాలుడి మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం. కాగా, నిన్న సాయంత్రం (సోమవారం) సదరు బాలిక ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ విఫలం కావడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో రాసింది.
Nizamabad | గ్రామంలో ఉద్రిక్తత..
సూసైడ్ నోట్ విషయాన్ని గ్రహించిన బాలిక కుటుంబీకులు, బంధువులు.. సదరు బాలుడి ఇంటికి చేరుకొని నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. బాధిత కుటుంబీకులను సముదాయించి, బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి (District Hospital) తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.