అక్షరటుడే, ఇందూరు:Giriraj College | ఎడ్యుకేషన్ వరల్డ్ సంస్థ(Education World Organization) ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ 2025-26కు గాను గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Giriraj Government Degree College)కు అవార్డు ప్రకటించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి(Dr. Rammohan Reddy) తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో అవార్డును అందుకున్నారు. అవార్డుకు ఎంపిక కావడం పట్ల కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం(College Vice Principal Rangaratnam), పరీక్షల నియంత్రణ అధికారి భరత్ రాజ్, అకాడమీ కోఆర్డినేటర్ గంగాధర్, పీఆర్వో దండు స్వామి, ఎన్సీపీ అధికారి లెఫ్ట్నెంట్ డాక్టర్ రామస్వామి, ఆయా విభాగాల అధిపతులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.