అక్షరటుడే, ఇందూరు: Giriraj Degree College | అన్నిరంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగిందని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం తెలిపారు. డ్రోన్ల ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయని పేర్కొన్నారు. బ్లూ రిబ్బన్ కన్సల్టెన్సీ(Blue Ribbon Consultancy), తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ (Telangana Skills and Knowledge Center) సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం కళాశాల ప్రాంగణాన్ని డ్రోన్ల వినియోగంపై అవగాహన కల్పించారు.
Giriraj Degree College | సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం, యుద్ధం, విపత్తు నిర్వహణ తదితర వాటిలో డ్రోన్ల వినియోగం పెరిగిందని రంగరత్నం పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అనేక రంగాల్లో డ్రోన్లను వినియోగిస్తున్నారని వివరించారు. భవిష్యత్తులో అన్ని రంగాల్లో వీటి వాడకం మరింత పెరుగుతుందని తెలిపారు. విద్యార్థులు డ్రోన్ టెక్నాలజీలో (Drone technology) మెలకువలను నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బ్లూ రిబ్బన్ డైరెక్టర్ శ్రీనివాసరావు, కళాశాల కెరీర్ గైడెన్స్ ప్లేస్మెంట్ సెల్ సమన్వయకర్త డాక్టర్ రామకృష్ణ, వాణిజ్యశాస్త్ర విభాగాధిపతి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
