Giriraj College
Giriraj College | పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

అక్షరటుడే, ఇందూరు : Giriraj College | గిరిరాజ్​ ప్రభుత్వ కాలేజీలో చదివిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. 2002–05 బ్యాచ్​ బీఏ విద్యార్థులు తమ చదువు పూర్తయి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఒకే వేదికపై కలుసుకున్నారు. తమ కాలేజీ నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.