అక్షరటుడే, ఆర్మూర్: Armoor | ఇస్కాన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని (Armoor Town) సిద్దుల గుట్ట చుట్టూ గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్బంగా భక్తులు హరినామ సంకీర్తనాలతో సిద్దుల గుట్ట చుట్టూ గిరిప్రదక్షిణ చేశారు.
కార్తీకమాసంలో సిద్ధుల గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణం చేయడం ఎంతో పుణ్యమని ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఇస్కాన్ అధ్యక్షుడు ఆది పురుష ప్రభుజీ, నిజామాబాద్ కంఠేశ్వర్ ఇస్కాన్ అధ్యక్షుడు రామానంద రాయ గౌరదాస్ ప్రభుజీ, భక్తులు పాల్గొన్నారు.
