- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Armoor | ఆర్మూర్ ఆర్టీసీలో గిఫ్ట్ స్కీమ్

Armoor | ఆర్మూర్ ఆర్టీసీలో గిఫ్ట్ స్కీమ్

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Armoor | ఆర్మూర్ ఆర్టీసీ డిపో (Armoor RTC depot) పరిధిలో ప్రయాణికులకు గిఫ్ట్ స్కీంను ఏర్పాటు చేసినట్లు డీఎం రవికుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.

ఈనెల 27 నుండి అక్టోబర్ 6 వరకు సెమి డీలక్స్, డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి, రాజధాని బస్సులో  ప్రయాణం ముగిసిన తర్వాత ప్రయాణికులు టికెట్ వెనకాల పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ రాసి బస్టాండ్​లో ఏర్పాటు చేసిన లక్కీడ్రా బాక్స్​లో (lucky draw box) వేయాలని తెలిపారు. అక్టోబర్ 8న లక్కీ డ్రా ద్వారా ముగ్గురు విజేతలను ఎంపిక చేస్తామన్నారు. మొదటి బహుమతిగా రూ.25 వేలు, రెండో బహుమతిగా రూ.15వేలు, మూడో బహుమతి గా రూ.10వేల నగదును చెక్కు రూపంలో అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు స్వాధీనం చేసుకోవాలని డీఎం కోరారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News