అక్షరటుడే, వెబ్‌డెస్క్: గ్లోబల్ మార్కెట్లు(Global market) అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. బుధవారం వాల్‌స్ట్రీట్ నష్టాలతో ముగియగా.. యూరోప్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా స్పందించాయి. గురువారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో యూఎస్(US)కు చెందిన ఎస్‌అండ్‌పీ 1.6 శాతం, నాస్‌డాక్(Nasdaq) 1.41 శాతం నష్టపోయాయి. గురువారం డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం ఫ్లాట్ గా కొనసాగుతోంది.
PRE MARKET ANALYSIS | యూరోప్ మార్కెట్లు..
జర్మనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ డీఏఎక్స్(DAX) 0.36 శాతం, యూకేకు చెందిన ఎఫ్‌టీఎస్‌ఈ 0.06 శాతం లాభపడ్డాయి. ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.40 శాతం నష్టపోయింది.
PRE MARKET ANALYSIS | ఆసియా మార్కెట్లలో సెల్లాఫ్..
ప్రధాన ఆసియా(Asia) మార్కెట్లు గురువారం నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన స్టాక్ ఎక్స్ఛేంజ్ కోస్పీ(Kospi) 1.31 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.90 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛ్‌ంజ్ 0.75 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హంగ్‌సెంగ్ 0.38 శాతం, సింగపూర్ స్టాక్ ఎక్స్ఛేంజ్ స్ట్రెయిట్ టైమ్స్ 0.48 శాతం, చైనాకు చెందిన షాంఘై(Shanghai) 0.10 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ (Gift nifty) 0.32 శాతం నష్టంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు కూడా నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
PRE MARKET ANALYSIS | గమనించాల్సిన అంశాలు..
- గత ట్రేడింగ్ సెషన్(Trading session)లో ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు నెట్ బయ్యర్లుగా మారారు. ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 2,201కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐ(DII)లు నికరంగా రూ. 683 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇజ్రాయిల్(Israel) యెమన్‌ల మధ్య యుద్ధ భయాలు పెరుగుతున్నాయి. జియో పొలిటికల్ టెన్షన్స్(Geo political tensions) మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశాలున్నాయి.
- ఆసియాలో కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో ఆందోళన నెలకొంది.
- క్రూడ్ ఆయిల్(Crude oil) ధర బ్యారెల్‌కు 0.11 శాతం 0.16 తగ్గి 61.47 డాలర్లకు చేరింది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.62 కి చేరింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 0.30 శాతం తగ్గి 4.59 వద్ద ఉంది. యూఎస్ డాలర్ ఇండెక్స్ 0.99 శాతం తగ్గి 99.47 వద్ద నిలిచింది.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.69 నుంచి 0.81కు తగ్గింది. విక్స్(VIX) 0.93 శాతం పెరిగి 17.55 వద్ద ఉంది. విక్స్ పెరగడం బుల్స్‌కు ప్రతికూలం.
- యూఎస్, భారత్‌ల మధ్య జూలైలో ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరే అవకాశాలున్నాయి.