అక్షరటుడే, వెబ్‌డెస్క్: గ్లోబల్ మార్కెట్లు(Global markets) మిశ్రమంగా స్పందిస్తున్నాయి. గురువారం వాల్‌స్ట్రీట్ మిక్స్‌డ్‌గా ముగియగా.. యూరోప్ మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. శుక్రవారం ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి.
యూఎస్‌కు చెందిన ఎస్‌అండ్‌పీ(S&P) గత ట్రేడిరగ్ సెషన్‌లో 0.41 శాతం లాభంతో ముగిసింది. నాస్‌డాక్ (Nasdaq)0.18 శాతం నష్టపోయింది. శుక్రవారం డౌజోన్స్ ఫ్యూచర్స్ ఫ్లాట్‌గా సాగుతోంది.
PRE MARKET ANALYSIS | లాభాల్లో యూరోప్ మార్కెట్లు
యూరోప్ మార్కెట్లు(Europe markets) గురువారం లాభాలతో ముగిశాయి. జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.71 శాతం మేర పెరగ్గా.. యూకేకు చెందిన ఎఫ్‌టీఎస్‌ఈ(FTSE) 0.56 శాతం లాభపడిoది. ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.21 శాతం లాభంతో ముగిసింది.
PRE MARKET ANALYSIS | నెగెటివ్‌లో ఆసియా మార్కెట్లు..
తైవాన్ స్టాక్ ఎక్స్ఛ్‌ంజ్ మినహా ప్రధాన ఆసియా(Asia) మార్కెట్లు శువ్రారం సైతం నష్టాలతో కొనసాగుతున్నాయి. కోవిడ్ కేసులు నమోదవుతుండడంతో ఆసియా మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛ్‌ంజ్ 0.43 శాతం లాభంతో ఉండగా.. కోస్పీ(Kospi) 0.24 శాతం లాభంతో కొనసాగుతోంది. హంగ్‌సెంగ్ 0.94 శాతం నష్టంతో ఉండగా.. షాంఘై 0.59 శాతం, నిక్కీ 0.26 శాతం, స్ట్రెయిట్ టైమ్స్ 0.18 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. ప్రధాన ఆసియా మార్కెట్లు నెగెటివ్‌గా ఉన్నా గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) మాత్రం 0.43 శాతం లాభంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
PRE MARKET ANALYSIS | గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్‌ఐఐ(FII)లు గురువారం నికరంగా రూ. 5,392 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు. డీఐఐలు మాత్రం నికరంగా రూ. 1,668 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- క్రూడ్ ఆయిల్(Crude oil) ధర స్వల్పంగా పెరిగింది. బ్యారెల్‌కు 0.11 శాతం పెరిగి 61.69 డాలర్లకు చేరింది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 14 పైసలు క్షీణించి 85.73 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్(Bond yeild) 0.16 శాతం తగ్గి 4.43 వద్ద ఉంది. యూఎస్ డాలర్ ఇండెక్స్ 0.23 శాతం తగ్గి 100.65 వద్ద నిలిచింది.
- ఇరాన్‌తో త్వరలోనే న్యూక్లియర్ డీల్ కుదిరే అవకాశాలున్నాయని యూఎస్(US) ప్రసిడెంట్ ట్రంప్ ప్రకటించారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.89 నుంచి 1.19కు పెరిగింది. విక్స్ వరుసగా నాలుగో సెషన్‌లోనూ తగ్గింది. గురువారం 1.93 శాతం తగ్గి, 16.89 వద్ద ఉంది. పీసీఆర్ పెరగడం, విక్స్(vix) తగ్గడం బుల్స్‌కు అనుకూలం.
- హాంగ్‌కాంగ్‌లో కోవిడ్(Covid) కేసులు పెరుగుతున్నాయి. ఇది మార్కెట్లలో ఆందోళన కలిగిస్తోంది.