Homeబిజినెస్​Stock market | జోరుమీదున్న గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

Stock market | జోరుమీదున్న గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock market | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) జోరుమీదున్నాయి. గురువారం అమెరికా మార్కెట్లు మంచి లాభాలతో ముగియగా.. శుక్రవారం ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. అమెరికాకు చెందిన నాస్‌డాక్‌(Nasdaq) 1.32 శాతం పెరగ్గా.. ఎస్‌అండ్‌పీ 0.63 శాతం లాభపడిరది. శుక్రవారం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌(Dow Jones Futures) సైతం 0.8 శాతం లాభంతో ట్రేడ్‌ అవుతోంది. యూరోప్‌లో మే ఒకటో తేదీ హాలిడే కావడంతో అక్కడి ప్రధాన స్టాక్‌ ఎక్స్ఛేంజీలు మూసి ఉన్నాయి.

Stock market | లాభాల్లో ఆసియా మార్కెట్లు..

ఆసియా మార్కెట్లు(Asian markets) లాభాలతో కొనసాగుతున్నాయి. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 2.02 శాతం పెరగ్గా.. హంగ్‌సెంగ్‌(Hangseng) 1.41 శాతం, నిక్కీ 0.69 శాతం, కోస్పీ 0.13 శాతం పాజిటివ్‌గా కదలాడుతున్నాయి. స్ట్రేయిట్స్‌ టైమ్స్‌ ఫ్లాట్‌గా ఉంది. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.22 శాతం లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Stock market | గమనించాల్సిన అంశాలు..

ఎఫ్‌ఐఐలు వరుసగా పదకొండో ట్రేడింగ్‌ సెషన్‌(Trading session)లోనూ నెట్‌ బయ్యర్లుగా నిలిచారు. చివరి ట్రేడింగ్‌ సెషన్‌లో నికరంగా రూ. 50 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు నికరంగా రూ. 1,792 కోట్ల విలువైన స్టాక్స్‌(Stocks) కొనుగోలు చేశారు.

  • రూపాయి విలువ రోజురోజుకు బలపడుతోంది. నవంబర్‌ స్థాయికి చేరింది. గురువారం డాలర్‌(Dollar)తో రూపాయి మారకం విలువ 77 పైసలు బలపడి 84.49 కి చేరింది.
  • డాలర్‌ ఇండెక్స్‌ 0.09 శాతం తగ్గి 100.11 వద్ద ఉంది.
  • క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధర బ్యారెల్‌కు 59.85 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • యుద్ధ భయాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లలో బుధవారం వొలటాలిటీ పెరిగింది. వొలటాలిటీ ఇండెక్స్‌4.91 శాతం పెరిగి, 18.22కు చేరింది. విక్స్‌(VIX) పెరగడం బుల్స్‌కు ప్రతికూలంగా మారుతుంది.
  • భారత్‌, పాక్‌ల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే పాకిస్థాన్‌తో ప్రత్యక్ష యుద్ధం కన్నా ఆ దేశాన్ని ఆర్థికంగా ఇబ్బందిపెట్టే చర్యలకే భారత్‌ ప్రాధాన్యత ఇస్తోంది.
  • యూఎస్‌, చైనా(China)ల మధ్య వాణిజ్యపరమైన అనిశ్చితి కొనసాగుతోంది. అమెరికా విధించిన టారిఫ్స్‌ ప్రభావాన్ని చైనా నిశితంగా పరిశీలిస్తోంది. త్వరలోనే టారిఫ్స్‌ టెన్షన్‌ తగ్గవచ్చని ఆ దేశం పేర్కొంటోంది.
  • గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌, వి మార్ట్‌ రిటైల్‌, జిందాల్‌ సా, మారికో, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌(IOB), సిటీ యూనియన్‌ బ్యాంక్‌, సనోఫీ ఇండియా, ఏథర్‌ ఇండస్ట్రీస్‌, తత్వ చింతన్‌ ఫార్మా, న్యూజెన్‌ సాఫ్ట్‌వేర్‌, ధని సర్వీసెస్‌, సుబెక్స్‌(Subex) తదితర కంపెనీలు శుక్రవారం త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి.