Homeబిజినెస్​Gift nifty | పాజిటివ్‌గా గ్లోబల్‌ క్యూస్‌.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

Gift nifty | పాజిటివ్‌గా గ్లోబల్‌ క్యూస్‌.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: భారత్‌, పాక్‌ల మధ్య జియోపొలిటికల్‌(Geo political) టెన్షన్స్‌ కొనసాగుతున్నా.. గ్లోబల్‌ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. టారిఫ్‌ వార్‌(Tariff war) విషయంలో యూఎస్‌, చైనా వెనక్కి తగ్గుతుండడంతో మార్కెట్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి. శుక్రవారం యూఎస్‌(US), యూరోప్‌ మార్కెట్లు లాభాలతో వీకెండ్‌ను ముగించగా.. సోమవారం ఆసియా మార్కెట్లు మాత్రం మిక్సిడ్ గా ట్రేడ్ అవుతున్నాయి. శుక్రవారం నాస్‌డాక్‌(Nasdaq) 1.26 శాతం పెరగ్గా.. ఎస్‌అండ్‌పీ 0.74 శాతం లాభపడింది. డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ మాత్రం సోమవారం 0.33 శాతం నష్టంతో కొనసాగుతోంది.

Gift nifty | యూరోప్ లో కొనసాగిన ర్యాలీ..

యూరోప్‌ మార్కెట్లలో ర్యాలీ కొనసాగింది. డీఏఎక్స్‌(DAX) 0.80 శాతం పెరగ్గా సీఏసీ 0.44 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.09 శాతం లాభపడ్డాయి.

Gift nify | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు..

ఆసియా మార్కెట్లు(Asian markets) మిశ్రమంగా కొనసాగుతున్నాయి. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.82 శాతం లాభంతో ఉండగా.. నిక్కీ(NIkkei) 0.51 శాతం, కోస్పీ 0.3 శాతం లాభంతో కదలాడుతున్నాయి. స్ట్రేయిట్స్‌ టైమ్స్‌ 0.42 శాతం, హంగ్‌సెంగ్‌ 0.09 శాతం నష్టంతో ఉండగా.. షాంఘై(Shanghai) ఫ్లాట్‌గా కొనసాగుతోంది. గిఫ్ట్‌ నిఫ్టీ 0.7 శాతం లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్‌ అప్‌(Gap up)లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే జియో పొలిటికల్‌ టెన్షన్స్‌ నెలకొన్న తరుణంలో మార్కెట్లు ఎలా స్పందిస్తాయన్నది వేచి చూడాల్సి ఉంది.

Gift nify | గమనించాల్సిన అంశాలు..

ఎఫ్‌ఐఐ(FII)లు వరుసగా ఎనిమిదో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ నెట్‌ బయ్యర్లుగా కొనసాగారు. శుక్రవారం నికరంగా రూ. 2,952 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. డీఐఐ(DII)లు సైతం నికరంగా రూ. 3,539 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.

  • క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధర బ్యారెల్‌కు 0.38 శాతం పెరిగి 63.26 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • గోల్డ్‌(Gold) ధర తగ్గుతోంది. ఈనెల 22 న రికార్డు స్థాయిలో 3,500.05 డాలర్లకు చేరిన ఔన్స్‌ బంగారం ధర ప్రస్తుతం 3,309.31 డాలర్లకు పడిపోయింది.
  • డాలర్‌ ఇండెక్స్‌ 0.07 శాతం పెరిగి 99.65 వద్ద ఉంది.
  • యూఎస్‌ 10 ఇయర్స్‌ బాండ్‌ ఈల్డ్‌ 0.19 శాతం పెరిగి 4.25 వద్ద ఉంది.
  • రూపాయి విలువ డాలర్‌తో 17 పైసలు క్షీణించి 85.44 వద్ద కొనసాగుతోంది.
  • భారత్‌(Bharath) ఆర్థిక వృద్ధి ఈ ఏడాది 6.5 శాతం ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది.
  • నెలవారీ ఆటో సేల్స్‌ డాటా రిలీజ్‌ కానుంది.
  • వొలటాలిటీ ఇండెక్స్‌ 5.58 శాతం పెరిగి, 17.16 వద్ద స్థిరపడింది. విక్స్‌(VIX) పెరగడం బుల్స్‌కు ప్రతికూలంగా మారుతుంది.
  • జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడుల నేపథ్యంలో భారత్‌, పాక్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించే అవకాశాలున్నాయి.