ePaper
More
    Homeబిజినెస్​Pre Market Analysis | బలహీనంగా గ్లోబల్‌ క్యూస్‌.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Pre Market Analysis | బలహీనంగా గ్లోబల్‌ క్యూస్‌.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : స్టాక్‌ మార్కెట్లు(Stock markets) కీలకమైన వారంలోకి అడుగుపెట్టాయి. ఈ వారంలో అమెరికా టారిఫ్‌ పాజ్‌(Tariff pause) గడువు ముగియనుంది. ట్రేడ్‌ డీల్స్‌ కుదుర్చుకోని దేశాలపై ఆగస్టు ఒకటో తేదీనుంచి ప్రతీకార సుంకాలు అమలులోకి వస్తాయని ఆ దేశం ప్రకటించింది. ఆ తర్వాత యూఎస్‌ అధ్యక్షుడు ఎలా వ్యవహరిస్తారోనన్న విషయమై అంతటా ఉత్కంఠ నెలకొంది. అలాగే యూఎస్‌ ఎఫ్‌వోఎంసీ చివరి సమావేశం కూడా మార్కెట్లను ప్రభావితం చేయనున్నారు. Q1 ఎర్నింగ్‌ సీజన్‌పైనా ఇన్వెస్టర్ల దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ నేపథ్యంలో గ్లోబల్‌ క్యూస్‌(Global cues) బలహీనంగా ట్రేడ్‌ అవుతున్నాయి.

    Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా శుక్రవారం యూఎస్‌ మార్కెట్లకు సెలవు. సోమవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.32 శాతం నష్టంతో కొనసాగుతోంది.

    Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    సీఏసీ 0.76 శాతం, డీఏఎక్స్‌ 0.62 శాతం నష్టంతో ముగియగా.. ఎఫ్‌టీఎస్‌ఈ ఫ్లాట్‌గా క్లోజ్‌ అయ్యింది.

    Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ఆసియా మార్కెట్లు సోమవారం ఉదయం నెగెటివ్‌గా సాగుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.73 శాతం, నిక్కీ(Nikkei) 0.44 శాతం, హంగ్‌సెంగ్‌ 0.33 శాతం, షాంఘై 0.17 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.23 శాతం, కోస్పీ 0.08 శాతం లాభంతో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.03 శాతం లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

    • ఎఫ్‌ఐఐలు వరుసగా ఐదో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా కొనసాగారు. శుక్రవారం నికరంగా రూ. 760 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐ(DII)లు కూడా నికరంగా రూ. 1,028 కోట్ల విలువైన స్టాక్స్‌ అమ్మారు.
    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.99 నుంచి 0.93కు తగ్గింది. విక్స్‌(VIX) 0.57 శాతం తగ్గి 12.32 వద్ద ఉంది. ఇది అక్టోబర్‌ 1వ తేదీ తర్వాత అత్యల్ప స్థాయి.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.98 శాతం తగ్గి 67.61 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 85.39 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.33 వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 97.04 వద్ద కొనసాగుతున్నాయి.
    • ఈనెల 9వ తేదీతో అమెరికా టారిఫ్‌ పాజ్‌ గడువు ముగియనుంది. పలు దేశాలతో ఇంకా ఎలాంటి ట్రేడ్‌ డీల్‌(Trade deal) కుదరలేదు. వాణిజ్య ఒప్పందం ఖరారు కాకపోతే జపాన్‌పై 30 శాతం సుంకాలు విధిస్తామని ఇప్పటికే ట్రంప్‌ ప్రకటించారు. యూరోపియన్‌ యూనియన్‌ వ్యవసాయ ఉత్పత్తులపై 17 శాతం టారిఫ్‌ విధిస్తామని పేర్కొంది. భారత్‌తోనూ ఇంకా ట్రేడ్‌ డీల్‌ కుదరలేదు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు(US president) ఎలా వ్యవహరిస్తారోనని మార్కెట్లలో ఉత్కంఠ నెలకొంది.
    • Q1 కార్పొరేట్‌ ఎర్నింగ్‌ సీజన్‌ ఈ వారంలో ప్రారంభం కానుంది. టీసీఎస్‌, డీమార్ట్‌, టాటా ఎలెక్సీ తదితర కంపెనీల మొదటి త్రైమాసిక ఫలితాలు వెలువడనున్నాయి. ఆయా కంపెనీలు వెలువరించే ఆర్థిక ఫలితాల ఆధారంగా మార్కెట్ల గమనం సాగనుంది.
    • వచ్చేనెలలో ఉత్పత్తిని పెంచనున్నట్లు ఒపెక్‌(OPEC) ప్రకటించడంతో బ్రెంట్‌ ముడి చమురు ధరలు తగ్గాయి. ఇది మన దేశానికి సానుకూలాంశం.

    Read all the Latest News on Aksharatoday.in

    More like this

    Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి

    అక్షరటుడే, కోటగిరి: Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి గిరిజనులంతా ఐక్యతతో ముందుకు సాగి, సేవాలాల్‌ బాటలో...

    Kaloji Jayanthi | పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కాళోజీ జయంతి వేడుకలు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Kaloji Jayanthi | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు....

    Formula E Race Case | ఫార్మూలా ఈ రేసులో భారీగా అవినీతి.. ఏసీబీ సంచలన నివేదిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E Race Case | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections)...