- Advertisement -
Homeబిజినెస్​Stock market | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ క్యూస్‌.. స్వల్ప గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

Stock market | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ క్యూస్‌.. స్వల్ప గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock market | టారిఫ్‌ వార్‌(Tariff war) విషయంలో యూఎస్‌, చైనా వెనక్కి తగ్గుతున్నాయి. ఇది సానుకూల అంశమే అయినా కెనడా(Canada) విషయంలో సుంకాలు పెంచే అవకాశాలు ఉండడంతో మార్కెట్లలో స్వల్ప ఒత్తిడి నెలకొంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. ఈసారి టారిఫ్‌ల విషయంలో యూఎస్‌(US)తో చర్చలకు సిద్ధమన్న చైనా ప్రకటన వాల్‌స్ట్రీట్‌(Wallstreet) ఇన్వెస్టర్లలో స్థైర్యాన్ని పెంచింది. దీంతో బుధవారం నాస్‌డాక్‌(Nasdaq) 2.50 శాతం పెరగ్గా.. ఎస్‌అండ్‌పీ 1.88 శాతం లాభపడింది. డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ మాత్రం 0.20 శాతం నష్టంతో కొనసాగుతోంది.

Stock market | యూరోప్‌ మార్కెట్లలో కొనసాగిన ర్యాలీ..

యూరోప్‌(Europe) మార్కెట్లలో ర్యాలీ కొనసాగింది. డీఏఎక్స్‌(DAX) 3.04 శాతం పెరగ్గా సీఏసీ 2.08 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.89 శాతం లాభపడ్డాయి.

- Advertisement -

Stock market | మిశ్రమంగా ఆసియా మార్కెట్లు..

ఆసియా మార్కెట్లు(Asian markets) మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో నిక్కీ(Nikkei) 1.07 శాతం, స్ట్రేయిట్స్‌ టైమ్స్‌ 0.41 శాతం, షాంఘై 0.25 శాతం లాభంతో ఉన్నాయి.
హంగ్‌సెంగ్‌ 0.69 శాతం, కోస్పీ(Kospi) 0.53 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.23 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ సైతం 0.2 శాతం నష్టంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు స్వల్ప గ్యాప్‌ డౌన్‌(Gap down)తో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Stock market | గమనించాల్సిన అంశాలు..

ఎఫ్‌ఐఐ(FII)లు వరుసగా ఆరో ట్రేడిరగ్‌ సెషన్‌లోనూ నెట్‌ బయ్యర్లుగా నిలిచారు. బుధవారం నికరంగా రూ. 3,323 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. డీఐఐలు నికరంగా రూ. 1,234 కోట్ల విలువైన స్టాక్స్‌(Stocks) విక్రయించారు.

  • క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధర బ్యారెల్‌కు 62.27 డాలర్ల వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది.
  • డాలర్‌ ఇండెక్స్‌ 0.25 శాతం తగ్గి 99.60 వద్ద కొనసాగుతోంది.
  • యూఎస్‌ 10 ఇయర్స్‌ బాండ్‌ ఈల్డ్‌ 0.71 శాతం తగ్గి 4.36 వద్ద ఉంది.
  • రూపాయి విలువ డాలర్‌(Dollar)తో 25 పైసలు బలపడి 85.42 వద్ద కొనసాగుతోంది.
  • బంగారం ధర దిగివస్తోంది.
  • రెసిప్రోకల్‌ టారిఫ్స్‌ విషయంలో వాణిజ్య చర్చలకు 90 దేశాలు ముందుకు వచ్చాయని ట్రంప్‌ ప్రకటించారు.
  • యూఎస్‌, చైనాల మధ్య వాణిజ్య యుద్ధ మేఘాలు క్రమంగా తొలగిపోతున్నాయి. అయితే కెనెడా విషయంలో అమెరికా కొంత కఠిన వైఖరి అవలంబిస్తోంది.
  • బజాజ్‌ ఫైనాన్స్‌(Bajaj finance) కంపెనీ ప్రత్యేక మధ్యంతర డివిడెండ్‌తోపాటు స్టాక్‌ స్ల్పిట్‌తోపాటు బోనస్‌ ప్రకటించే అవకాశాలను పరిశీలిస్తోంది.
- Advertisement -
- Advertisement -
Must Read
Related News