Homeబిజినెస్​Pre Market analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ..

Pre Market analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిశ్రమంగా స్పందిస్తున్నాయి. వాల్‌స్ట్రీట్‌(Wall street)తోపాటు యూరోప్‌ మార్కెట్లు నెగెటివ్‌గా ఉండగా.. ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. మంగళవారం యూఎస్‌(US)కు చెందిన నాస్‌డాక్‌ 0.87 శాతం, ఎస్‌అండ్‌పీ(S&P) 0.77 శాతం మేర నష్టపోయాయి. బుధవారం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ సైతం 0.95 శాతం నష్టంతో ట్రేడ్‌ అవుతోంది. ఫెడ్‌ మీటింగ్‌(Fed meeting) నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో వాల్‌స్ట్రీట్‌ నష్టాలతో ముగిసింది.

Pre Market analysis | యూఎస్‌ బాటలో యూరోప్‌ మార్కెట్లు..

యూరోప్‌(Europe) మార్కెట్లు సైతం నష్టాలతో ముగిశాయి. డీఏఎక్స్‌ 0.41 శాతం, సీఏసీ(CAC) 0.40 శాతం నష్టపోగా.. ఎఫ్‌టీఎస్‌ఈ మాత్రం ఫ్లాట్‌గా ముగిసింది.

Pre Market analysis | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా(Asia) మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో హంగ్‌సెంగ్‌(Hang seng) 1.39 శాతం లాభంతో ఉండగా.. షాంఘై 0.58 శాతం, కోస్పీ(Kospi) 0.30 శాతం లాభంతో ఉన్నాయి. స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.16 శాతం నష్టంతో ఉంది. నిక్కీ, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.25 శాతం నష్టంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు గ్యాప్‌ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Pre Market analysis | గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్‌ఐఐ(FII)లు ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లపై నమ్మకంతో ఉన్నారు. వరుసగా 13వ ట్రేడింగ్‌ సెషన్‌(Trading session)లోనూ వారు నెట్‌ బయ్యర్లుగా నిలిచారు. ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 3,794 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు మాత్రం రూ. 1,397 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు.
  • క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధర పెరుగుతోంది. బుధవారం 0.80 శాతం పెరిగి 59.55 డాలర్లకు చేరింది.
  • రూపాయి విలువ 17 పైసలు తగ్గి 84.43 వద్ద నిలిచింది.
  • ఇండియా విక్స్‌(VIX) పెరుగుతుండడం బుల్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. 3.59 శాతం మేర పెరిగి, 19 వద్ద ఉంది. మార్కెట్లలో తీవ్ర వొలటాలిటీని ఇది సూచిస్తోంది.
  • నిఫ్టీ పుట్‌ కాల్‌ రేషియో(PCR) 0.97 నుంచి 0.92 కు తగ్గింది. మన మార్కెట్లలో బుల్లిష్‌ సెంటిమెంట్‌ కాస్త తగ్గడాన్ని సూచిస్తోంది.
  • స్వేచ్ఛా వాణిజ్యం(Free trade) విషయంలో భారత్‌, బ్రిటన్‌ల మధ్య కొన్ని వస్తువుల విషయంలో వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. ఇది మన దేశంనుంచి ఎగుమతులు చేసే టెక్స్‌టైల్‌, మెరైన్‌, ఫుట్‌వేర్‌, జెమ్స్‌(Gems), జ్యువెల్లరీ తదితర కంపెనీలకు అనుకూలం.
  • భారత్‌(Bharath), పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ దాడి చేయడంతో మార్కెట్లలో యుద్ధ భయాలు నెలకొన్నాయి.
  • యూఎస్‌ ఫెడ్‌ మానిటరీ పాలసీపై బుధవారం అనౌన్స్‌మెంట్‌ చేయనుంది. ఫెడ్‌ చైర్మన్‌ ఏ విధమైన కామెంటరీ ఇస్తారోనన్న కుతూహలం మార్కెట్లలో నెలకొంది.