Stock market | నష్టాల్లో గిఫ్ట్‌ నిఫ్టీ.. గ్యాప్‌ డౌన్‌ ఓపెనింగ్‌కు అవకాశం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock market | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిశ్రమంగా స్పందిస్తున్నాయి. మంగళవారం అమెరికాకు చెందిన ఎస్‌అండ్‌పీ 0.58 శాతం, నాస్‌డాక్‌(Nasdaq) 0.56 శాతం లాభపడ్డాయి. డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ మాత్రం సోమవారం 0.19 శాతం నష్టంతో కదలాడుతోంది. Stock market | యూరోప్‌లో.. యూరోపియన్‌ మార్కెట్లు మంగళవారం మిక్స్‌డ్‌(Mixed)గా ముగిశాయి. డీఏఎక్స్‌ 0.69 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ(FTSE) 0.54 శాతం పెరగ్గా.. సీఏసీ 0.50 శాతం నష్టపోయింది. Stock market | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. ఆసియా […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock market | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిశ్రమంగా స్పందిస్తున్నాయి. మంగళవారం అమెరికాకు చెందిన ఎస్‌అండ్‌పీ 0.58 శాతం, నాస్‌డాక్‌(Nasdaq) 0.56 శాతం లాభపడ్డాయి. డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ మాత్రం సోమవారం 0.19 శాతం నష్టంతో కదలాడుతోంది.

Stock market | యూరోప్‌లో..

యూరోపియన్‌ మార్కెట్లు మంగళవారం మిక్స్‌డ్‌(Mixed)గా ముగిశాయి. డీఏఎక్స్‌ 0.69 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ(FTSE) 0.54 శాతం పెరగ్గా.. సీఏసీ 0.50 శాతం నష్టపోయింది.

Stock market | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు..

ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా కొనసాగుతున్నాయి. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో స్ట్రేయిట్స్‌ టైమ్స్‌ 0.40 శాతం లాభంతో కొనసాగుతుండగా.. తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.28 శాతం, నిక్కీ(Nikkei) 0.17 శాతం పాజిటివ్‌గా కదలాడుతున్నాయి. కోస్పీ 0.76 శాతం నష్టంతో ఉండగా.. హంగ్‌సెంగ్‌ 0.35 శాతం, షాంఘై 0.2 శాతం నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.4 శాతం నష్టంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్‌ డౌన్‌(Gap down)లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Stock market | గమనించాల్సిన అంశాలు..

ఎఫ్‌ఐఐ(FII)లు వరుసగా పదో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ నెట్‌ బయ్యర్లుగా నిలిచారు. మంగళవారం నికరంగా రూ. 2,385 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు సైతం నికరంగా రూ. 1,369 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు. ఎఫ్‌ఐఐలు మన మార్కెట్‌లో వరుసగా పది ట్రేడింగ్‌(Trading) సెషన్లలో నికర కొనుగోలుదారులుగా నిలవడం రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి.

  • రూపాయి విలువ డాలర్‌తో 21 పైసలు తగ్గి 85.25 కి చేరింది.
  • డాలర్‌ ఇండెక్స్‌ 0.11 శాతం పెరిగి 99.35 వద్ద ఉంది.
  • క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధర బ్యారెల్‌కు 0.79 శాతం తగ్గి 59.93 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • దేశీయ స్టాక్‌ మార్కెట్ల(Domestic stock markets)లో మంగళవారం వొలటాలిటీ పెరిగింది. వొలటాలిటీ ఇండెక్స్‌ 2.54 శాతం పెరిగి, 17.37 వద్ద ఉంది. విక్స్‌ పెరగడం బుల్స్‌కు ప్రతికూలం.
  • భారత్‌, పాక్‌ల మధ్య యుద్ధ భయాలు పెరుగుతున్నాయి. వచ్చే 36 గంటల్లో భారత్‌(Bharath) దాడి చేసే అవకాశాలున్నాయని పాకిస్థాన్‌ భావిస్తోంది.
  • అమెరికా, భారత్‌ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి. సెప్టెంబర్‌లో సుంకాలు తగ్గే అవకాశాలున్నాయి.
  • యూఎస్‌(US)తో వాణిజ్య యుద్ధం విషయంలో చైనా వెనక్కి తగ్గుతోంది. అమెరికానుంచి దిగుమతి చేసుకునే ఇథేన్‌పై 125 శాతం టారిఫ్‌ ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది.
  • ఈరోజు అదాని పవర్‌(Adani power), ఫెడరల్‌ బ్యాంక్‌, ఇండస్‌ టవర్స్‌, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా, పారస్‌ డిఫెన్స్‌, సోనా బీఎల్‌డబ్ల్యూ, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, వరుణ్‌ బేవరేజెస్‌, ఐవోసీ, ఎంవోఐఎల్‌ క్యూ4 ఫలితాలు ప్రకటించనున్నాయి.

Related articles

Kamareddy corruption free governance | కామారెడ్డిలో అవినీతి రహిత పాలన అందించాలి: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy corruption free governance | కామారెడ్డి పట్టణ ప్రజలకు (Kamareddy Municipality) అవినీతి రహిత పాలన అందించాలని కొత్తగా బాధ్యతలు...

Kalvakuntla Kavitha New Party | గద్వాల నుంచే కొత్త పార్టీ : కల్వకుంట్ల కవిత

జోగులాంబ గద్వాల జిల్లా నుంచే తాను కొత్త పార్టీ పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి ఆధ్వర్యంలో గద్వాలలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో ఆమె మాట్లాడారు

Kamareddy Yellow Alert | కామారెడ్డికి ఎల్లో అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరిక..

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Yellow Alert | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. కామారెడ్డి (Kamareddy), కొమురం భీం...

Municipal Election Shock | బీజేపీ, బీఆర్​ఎస్​లకు మున్సిపల్​ ఎన్నికలు షాక్​ ఇచ్చాయి : మానాల మోహన్​రెడ్డి

మున్సిపల్​, జీపీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్​ఎస్​లకు షాక్​ తగిలిందని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.