ePaper
More
    HomeతెలంగాణHyderabad | హైద‌రాబాదీల‌కి గుడ్ న్యూస్.. వ‌ర‌ద స‌మ‌స్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్

    Hyderabad | హైద‌రాబాదీల‌కి గుడ్ న్యూస్.. వ‌ర‌ద స‌మ‌స్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | ఐటీ, ఫార్మా రంగాల్లో హైదరాబాద్(Hyderabad) నగరం, విశ్వనగరంగా మారే దిశగా అభివృద్ధి చెందుతోంది. కానీ ఈ ప్రగతికి పెద్ద అడ్డంకిగా మారింది వర్షాల సమయంలో వచ్చే వరదలు. మోస్తరు వర్షం కురిసినా కూడా లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోవడం, ప్రధాన రహదారులు చెరువులను తలపించడం, ట్రాఫిక్ జామ్‌లు(Traffic Jams), విద్యుత్ అంతరాయాలు(Power Outages), అన్నీ కలసి నగర జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ (GHMC) ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఈ ప్రణాళిక అమలైతే, రానున్న సంవత్సరాల్లో హైదరాబాద్ వరద సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

    Hyderabad | కీల‌క అడుగు..

    ముఖ్యమైన చర్యలు ఏంటంటే … ఔటర్ రింగ్ రోడ్ (Outer Ring Road) పరిధిలోని ప్రాంతాల కోసం వరద నీటి వ్యవస్థ అభివృద్ధి చేయాలని చూస్తుంది, గతంలో కేవలం GHMC సరిహద్దుల్లోని నాలాలపై మాత్రమే సర్వే జరిగింది. ఇప్పుడు శివారు ప్రాంతాల వరకూ విస్తరించి, పూర్తి ORR పరిధిలో డిజిటల్ సర్వే చేపట్టనున్నారు.గొలుసుకట్టు చెరువులు, నాలాల అభివృద్ధి,వరద నీరు క్రమబద్ధంగా నదులకు చేరేలా చెరువులు పరస్పరంగా అనుసంధానం చేయనున్నారు.నదుల వందేళ్లపాటు ఉన్న ప్రవాహ మార్గాలను గుర్తించి, వాటిని జియో ట్యాగ్ చేయనున్నారు. ఈ ప్రణాళికకు పురపాలక శాఖ(Municipal Department) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    READ ALSO  CM Revanth | రాష్ట్రంలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్​ కీలక ఆదేశాలు..

    వెంటనే ఒక కన్సల్టెన్సీని నియమించి ప్రాథమిక అధ్యయనం ప్రారంభించాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి.జలవనరుల రక్షణకు ఆధునిక సాంకేతికత వినియోగం,Survey of India, Google Maps సహాయంతో గత దశాబ్దాల్లో ఉన్న నాలాలు, చెరువుల స్థానాలు గుర్తించనున్నారు.వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అక్షాంశ-రేఖాంశాల ఆధారంగా రికార్డు చేయనున్నారు.హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్, గండిపేట వంటి ప్రధాన జలాశయాలు ఉండ‌గా వీటికి అనుసంధానమైన చెరువులు, వరద నాలాలు, మూసీ నదిని కాంటూర్ మ్యాపింగ్ ఆధారంగా వరద ప్రవాహ మార్గాలను అభివృద్ధి చేస్తారు. ఈ క్రమంలో చెరువుల హద్దులను స్పష్టంగా నిర్ణయించి, వాటిని బలోపేతం చేయడం, అలాగే నాలాల పొడవును, గందరగోళాన్ని తగ్గించడం కీలక భాగాలుగా మారనున్నాయి.

    Latest articles

    Political Rakhi | రాఖీకి ఆ కేటీఆర్​, జగన్​ దూరం.. తెగిన బంధం..!

    అక్షరటుడే, హైదరాబాద్: Political Rakhi | ఏటా శ్రావణ (Shravan) మాసంలో వచ్చే పున్నమిని రాఖీ పౌర్ణమిగా నిర్వహించుకుంటాం....

    GHMC | కుంభవృష్ఠి.. అబ్దుల్లాపూర్‌మెట్‌లో 12.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: GHMC : హైదరాబాద్​లో కుంభవృష్ఠి కురుస్తోంది. భారీ తెప్ప మహానగరానికి అమాంతం ముంచెత్తింది. భారీ వర్షం(heavy rain)తో...

    Police Raids | పేకాట స్థావరాలపై దాడులు.. పోలీసుల అదుపులో పొలిటికల్ లీడర్లు!

    అక్షరటుడే, కామారెడ్డి : Police Raids : పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేపడుతున్నారు. పక్కా సమాచారంతో...

    BJP | ఈసీ మీద నమ్మకం లేకుంటే రాజీనామా చేయ్.. రాహుల్ గాంధీకి బీజేపీ సవాల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP | ఎన్నికల సంఘంపై ప్రత్యక్ష దాడికి దిగిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ...

    More like this