అక్షరటుడే, వెబ్‌డెస్క్: GHMC Commissioner | కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు (Government Employees) ఏళ్లుగా ఒకే దగ్గర తిష్ట వేస్తారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ నేతలను మచ్చిక చేసుకుంటారు.అలాంటి ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేసిన మరోచోటుకు వెళ్లడానికి ఇష్టపడారు. తాము ఇక్కడే ఉంటామని, నాయకులతో చెప్పిస్తుంటారు. అయితే ఇలాగే బదిలీ చేస్తే వెళ్లకుండా మంత్రితో ఫోన్ చేయించిన డిప్యూటీ కమిషనర్‌కు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ (RV Karnan) షాక్ ఇచ్చారు. అతడిపై సస్పెన్షన్ వేటు వేశారు.
GHMC Commissioner | అల్వాల్ సర్కిల్ నుంచి
జీహెచ్ఎంసీ కమిషనర్ ఇటీవల డిప్యూటీ కమిషనర్ల బదిలీ చేపట్టారు. ఇందులో భాగంగా అల్వాల్ సర్కిల్ (Alwal Circle)లో పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డిని కవడిగూడ (Kavadiguda)కు బదిలీ చేశారు. అయితే ఆయన అక్కడకు వెళ్లడానికి ఇష్టపడలేదు. బదిలీ చేసిన ప్రాంతంలో విధుల్లో చేరకుండా ఓ మంత్రి, స్థానిక నాయకుడితో కమిషనర్‌కు ఫోన్ చేసినట్లు సమాచారం. అల్వాల్‌లోనే కొనసాగించాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ ఆర్వీ కర్ణన్ సదరు డిప్యూటీ కమిషనర్‌ను సస్పెండ్ చేశారు.
GHMC Commissioner | అవినీతి ఆరోపణలు
అల్వాల్ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న సమయంలో ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు కేటాయించినట్లు శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy)పై ఆరోపణలు ఉన్నాయి. ప్రజల నుంచి అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఒక వృద్ధుడికి సంబంధించిన ప్రాపర్టీ టాక్స్ వ్యవహారంలో తన పరిధిని మించి వ్యవహరించాడని ఫిర్యాదు కూడా అందింది. అలాగే ఆర్టీఐ దరఖాస్తులకు వివరాలు ఇవ్వకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం, ప్రోటోకాల్ ఉల్లంఘనలపై ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే అధికారులు విచారణ జరిపి అతడిని బదిలీ చేశారు. అయితే తాను ఇక్కడే కొనసాగుతానని శ్రీనివాస్‌రెడ్డి కవాడిగూడలో జాయిన్ కాలేదు. తన ఆదేశాలను పట్టించుకోకవపోడం, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.