అక్షరటుడే, వెబ్‌డెస్క్: GHMC : హైదరాబాద్‌లో కుంభవృష్ఠి కురుస్తోంది. భారీ తెప్ప మహానగరానికి అమాంతం ముంచెత్తింది. భారీ వర్షం(heavy rain)తో రోడ్లపై జలమయమై చెరువులను తలపిస్తున్నాయి.
తెలంగాణ(Telangana)లోని పలు ప్రాంతాల్లోనూ కుండపోత వర్షం కురుస్తోంది. ఇప్పటి వరకు నమోదైన వర్షపాత వివరాలను పరిశీలిస్తే..
- అత్యధికంగా అబ్దుల్లాపూర్‌మెట్‌లో 12.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
- బేగంబజార్‌లో అత్యధికంగా 117.5 సెం.మీ వర్షపాతం కురిసింది.
- చార్మినార్ వద్ద 10.6 వర్షపాతం రికార్డు అయింది.
- పెద్ద అంబర్‌పేట్, బాలాపూర్‌లో 10 సెం.మీ. వర్షపాతం పడింది.
- ఖైరతాబాద్‌లో 9.4 సెంటీ మీటర్ల వర్షపాతం పడింది.
- నాంపల్లిలోనూ వాన దంచికొట్టింది. ఇక్కడ 9.2 సెం.మీ. వర్షపాతం నమోదు అయింది.
- హయత్‌నగర్ డిఫెన్స్ కాలనీ 9 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
- హయత్‌నగర్‌లో 8.8 సెం.మీ వర్షపాతం నమోదు నమోదు కావడం గమనార్హం.
- ముషీరాబాద్ జవహర్ నగర్లో 8.6 సెం.మీ. వర్షం పడింది.
- హిమాయత్‌నగర్ GHMC హెడ్ ఆఫీస్‌లో 8.5 సెం.మీ. వర్షపాతం రికార్డు అయింది.
- గన్ ఫౌండ్రీలో 8.4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం.