HomeతెలంగాణRailway gate | ఘన్​పూర్ రైల్వేగేట్ మూసివేత.. ఎప్పటి నుంచంటే..!

Railway gate | ఘన్​పూర్ రైల్వేగేట్ మూసివేత.. ఎప్పటి నుంచంటే..!

- Advertisement -

అక్షరటుడే, డిచ్​పల్లి: Railway gate | మండలంలోని ఘన్​పూర్-డిచ్​పల్లి (Ghanpur-Dichpally) మధ్య రైల్వేగేట్​ను మరమ్మతుల దృష్ట్యా మూసివేయనున్నారు. ఈ మేరకు డిచ్​పల్లి పంచాయతీ కార్యదర్శి రమేశ్ (Panchayat Secretary Ramesh)​ సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఈనెల 21వ తేదీ నుంచి 24వ తేదీ రాత్రి 11 గంటల వరకు రైల్వేగేట్​ మూసి ఉంటుందని ఆయన వివరించారు.

రైలు పట్టాల మరమ్మతుల (Railway track repairs) కారణంగా గేట్​ను ముసివేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాబట్టి ఘన్​పూర్, ముల్లంగి, ఖిల్లా డిచ్​పల్లి గ్రామాల ప్రజలు ప్రత్యామ్నాయ మార్గం గుండా వెళ్లాలని ఆయన సూచించారు.