ePaper
More
    Homeలైఫ్​స్టైల్​Yoga | యోగాకు ముందు సూక్ష్మ వ్యాయామం తప్పనిసరి

    Yoga | యోగాకు ముందు సూక్ష్మ వ్యాయామం తప్పనిసరి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Exercise | యోగా(Yoga) సాధన శారీరక దృఢత్వంతోపాటు మానసిక ప్రశాంతత ఇస్తుంది. నిత్యం యోగా చేస్తే చాలా రకాల ఆరోగ్య సమస్యలు (Health issues) దూరమవుతాయి. అయితే యోగాసనాలు వేసే ముందు తప్పనిసరిగా సూక్ష్మ్ష వ్యాయామాలు చేయాలని యోగా గురువులు (Yoga Instructors) సూచిస్తున్నారు. చిన్నచిన్న వ్యాయామాలు (Exercises) చేయడం వల్ల యోగా సాధన చేయడానికి మన శరీరం అనుకూలంగా మారుతుందన్నది వీరి ఉద్దేశం.

    Yoga | సూక్ష్మ వ్యాయామాలు..

    నిటారు(Straight)గా నిలబడాలి. పిడికిళ్లు బిగించి ఛాతీకి ఆనించాలి. ఆ తర్వాత మడమలు పిరుదులను తాకేలా జాగింగ్‌ (Jogging) చేయాలి. మెల్లిగా ప్రారంభించి క్రమంగా వేగం పెంచుతూ ఈ ప్రక్రియ కొంతసేపు సాగించాలి. తర్వాత మోకాళ్లను ముందుకు తీసుకువస్తూ ఛాతీని తాకిస్తూ జాగింగ్‌ కంటిన్యూ చేయాలి. ఇలా కొంతసేపు చేశాక కాసేపు విరామం(Relax) ఇవ్వాలి.

    READ ALSO  Tea Benefits | ఛాయ్‌.. భలే లాభాలోయ్‌.. టీ తాగితే గుండెజ‌బ్బులు దూరం

    అనంతరం కాళ్లు, వేళ్లను ఫ్లెక్సిబుల్‌గా మార్చేందుకు సూక్ష్మ వ్యాయామం చేయాలి. నిటారుగా నిలబడి శరరం బరువును కాలి వేళ్లపై ఉంచుతూ మడమలను పైకి కిందికి ఆడించాలి. తర్వాత మోకాళ్ల వద్ద వంచకుండా వీలైనంత ముందుకు, వెనక్కి ఆడించాలి.

    భుజాలను కదలించడం, నడుమును ముందుకు వెనక్కి, పక్కలకు వంచడం, తలను అటూ ఇటూ కదిలించడం, గుండ్రంగా తిప్పడం చేయాలి. ఇలా సూక్ష్మ వ్యాయామాలు చేశాక చివరిగా బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌ (శ్వాసకు సంబంధించిన వ్యాయామం) చేసి యోగాను ప్రారంభించాలి. యోగా అయినా, సూక్ష్మ వ్యాయామాలైనా శ్వాస(Breath)పై దృష్టి సారించి చేయాల్సి ఉంటుంది. గురువు ద్వారా నేర్చుకుని సాధన చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు.

    Latest articles

    Malnadu Drugs Case | మల్నాడు డ్రగ్స్ కేసులో ట్విస్ట్‌.. నిందితుడు రాహుల్‌ తేజ్‌పై మరో డ్రగ్స్‌ కేసు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant)​...

    Cabinet | నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం

    అక్షరటుడే, హైదరాబాద్: Cabinet : తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Chief Minister Revanth...

    IND vs ENG | బ‌జ్ బాల్ బ్యాటింగ్‌తో బెంబేలెత్తించిన ఇంగ్లండ్‌.. భార‌త బౌలర్స్ బేజార్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs ENG : మాంచెస్ట‌ర్ టెస్ట్ మ్యాచ్‌ (Manchester Test match) లో ఇంగ్లండ్...

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. భారీ గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి. గురువారం సెషన్‌లో యూఎస్‌,...

    More like this