ePaper
More
    Homeక్రైంDrushyam Movie Effect | దృశ్యం సినిమా ప్రభావం: ప్రియుడితో లేచిపోవడానికి.. మరొకరిని హత్య చేసి...

    Drushyam Movie Effect | దృశ్యం సినిమా ప్రభావం: ప్రియుడితో లేచిపోవడానికి.. మరొకరిని హత్య చేసి తానే చనిపోయినట్టుగా నాటకం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Drushyam Movie Effect | సూప‌ర్ హిట్ చిత్రం దృశ్యం Drushyam ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ మూవీ అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల హృదయాలను తాకింది. కుటుంబ విలువలు, కథనం, మిస్టరీ అన్ని బాగున్నాయి. అయితే ఈ సినిమాని ప్రేర‌ణ‌గా తీసుకొని ఓ మ‌హిళ పెద్ద ఘోర‌మే చేసింది. అమాయకుడిని చంపేసి, తానే చనిపోయినట్టుగా ప్రణాళిక రచించింది. అయితే, ఆ ప్లాన్ బెడిసికొట్టడంతో పోలీసులకు చిక్కి, జైలు ఊచలు లెక్కిస్తుంది. వివ‌రాల‌లోకి వెళితే .. జఖోట్రాకు చెందిన వివాహిత గీతా అహిర్(22)కు భరత్ (21)తో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది.

    Drushyam Movie Effect | ఏమ‌న్నా స్కెచ్చా..

    వారిద్ద‌రు వేరే ప్రాంతానికి వెళ్లి బ్ర‌తకాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇక్క‌డే ఉంటే దొరికిపోతామ‌ని ప‌క్కా స్కెచ్ వేసింది గీత‌. తెలుగుతో పాటుగా ఇతర బాషల్లో బాగా పాపులర్ అయిన దృశ్యం సినిమా(Drushyam movie)ను ప్రేరణగా తీసుకుని తాను చనిపోయినట్టుగా ఓ సీన్ క్రియేట్ చేసేందుకు ప్రియుడితో ప్లాన్ వేసింది. ఈ క్ర‌మంలో రోడ్డుపై వెళ్తున్న ఓ వృద్ధుడికి భరత్ లిప్ట్ ఇచ్చాడు. నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లాక అతన్ని కత్తితో పొడిచి చంపేశాడు. హర్జీభాయ్ సోలంకీ(56) మ‌ర‌ణించాక అత‌ని మృత‌దేహాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తరలించారు. అదేరోజు రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయాక గీత Geeta ahir ఇంటి నుంచి బయటకు వచ్చింది.

    అయితే తాను చనిపోయినట్టుగా నమ్మించేందుకు ప్రియుడు భరత్‌తో Bharat కలసి హర్జీభాయ్ శవానికి తన బట్టలు వేసి కాళ్ళకు గజ్జలు తొడిగింది. అనంత‌రం శవంపై పెట్రోల్ పోసి నిప్పంటించి, ఆ తర్వాత ఇద్దరూ కలిసి అక్కడ నుంచి పారిపోయారు. తన మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు ఎవ‌రు త‌నకోసం వెత‌క‌ర‌ని గీత భావించింది. ఆమె అనుకున్న‌ట్టుగానే గ్రామ శివార్లలో సగం కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని చూసి అది గీతదేనని తొలుత భావించారు. కాని నిశితంగా పరిశీలించగా, అది పురుషుడు శవంగా ఉన్నట్టు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు(Police)… విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మొబైల్, ఇతర సాంకేతిక ఆధారాల సాయంతో గీత, భరత్‌లు జోధ్‌పూర్‌కు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ సినిమాల్లోని సన్నివేశాల నుంచి స్ఫూర్తి పొంది ఈ హత్యకు పథకం రచించినట్లు గీత పోలీసుల ఎదుట అంగీకరించింది.

    Latest articles

    India Alliance | సుప్రీం వ్యాఖ్య‌ల‌పై విప‌క్షాల అస‌హ‌నం.. అసాధార‌ణ వ్యాఖ్య‌ల‌ని మండిపాటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India Alliance | లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్‌గాంధీపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇండి...

    Aditya Infotech | అదరగొట్టిన ‘ఆదిత్య’.. ఇన్వెస్టర్లను ముంచేసిన కాయ్‌టెక్స్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Aditya Infotech | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో మంగళవారం మూడు కంపెనీలు లిస్టయ్యాయి. ఇందులో...

    Register Post | పోస్టల్ శాఖ సంచలన నిర్ణయం.. నిలిచిపోనున్న రిజిస్టర్​ పోస్ట్​ సేవలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Register Post | పోస్టల్​ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. రిజిస్టర్​ పోస్ట్​ సేవలను నిలిపి...

    Deepika Padukone | రికార్డుల‌కెక్కిన దీపికా పదుకొనే.. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక వ్యూస్ దాటిన ఆమె రీల్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Deepika Padukone | బాలీవుడ్ నటి దీపికా పదుకొనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు....

    More like this