అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Donald Trump | ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే అనేక యుద్ధాలను ఆపానని, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ (Afganistan) మధ్య నెలకొన్న సంఘర్షణను కూడా నిలువరిస్తానని చెప్పుకొచ్చారు.
భారతదేశం, పాకిస్తాన్(Pakistan) మధ్య సైనిక ఘర్షణను సుంకాలను ఉపయోగించి అనేక వివాదాలను పరిష్కరించానని పునరుద్ఘాటించారు. భారీ సుంకాల గురించి రెండు దేశాలను హెచ్చరించడంతో 24 గంటల్లోనే వివాదం పరిష్కృతమైందని చెప్పారు. సుంకాలను ఉపయోగించకుండా తాను దీనిని సాధించలేనని కూడా ఆయన పేర్కొన్నారు. గాజా (Gaza) శాంతి ప్రణాళికతో అందరూ సంతోషంగా ఉంటారని చెప్పారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఇజ్రాయెల్‌కు వెళ్లే మార్గంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Donald Trump | నోబెల్ ఎందుకు రాలేదో..
దేశాల మధ్య సంఘర్షణలు తాను నిలువరించానని ట్రంప్ మరోసారి చెప్పుకున్నారు. యుద్ధాలు ఆపాడంలో తాను స్పెషలిస్టునని, అయినా నోబెల్ బహుమతి ఎందుకు రాలేదో తెలియదన్నారు. అయినప్పటికీ తమ శాంతి ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. గాజా శాంతి ప్రణాళిక, తన రాబోయే ఇజ్రాయెల్ పర్యటన గురించి ట్రంప్ (Donald Trump) మాట్లాడుతూ.. అన్ని పార్టీలను సంతోషపెట్టాలని ఉద్దేశించినట్లు చెప్పారు. ఈజిప్టును సందర్శించి, మధ్యప్రాచ్య పరిస్థితిని చర్చించడానికి అనేక ప్రాంతీయ నాయకులతో సమావేశం కానున్నట్టు ప్రకటించారు. “మేము అందరినీ సంతోషపెట్టబోతున్నాం… అందరూ సంతోషంగా ఉన్నారు, అది యూదులు అయినా, ముస్లింలు అయినా, అరబ్ దేశాలు అయినా.. ఇజ్రాయెల్ తర్వాత ఈజిప్టుకు వెళ్తున్నా. చాలా శక్తివంతమైన, పెద్ద దేశాలు, చాలా ధనిక దేశాలు, ఇతరుల నాయకులందరినీ కలవబోతున్నా వారందరూ ఈ ఒప్పందంలో ఉన్నారు” అని ఆయన వివరించారు.
Donald Trump | సుంకాలతోనే సాధ్యం..
సుంకాల అస్త్నాన్ని ప్రయోగించే తాను భారత్-పాక్(India-Pak) సహా అనేక యుద్ధాలను ఆపానని ట్రంప్ తెలిపారు. “నేను కొన్ని యుద్ధాలను సుంకాల ఆధారంగా మాత్రమే నిలువరించాను. ఉదాహరణకు, భారతదేశం. పాకిస్తాన్ సంఘర్షణ. మీరు యుద్ధం చేయాలనుకుంటే నేను మీ ఇద్దరిపై 100 శాతం, 150 శాతం, 200 శాతం సుంకాలను విధిస్తానని చెప్పాను. తద్వారా 24 గంటల్లోనే అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధాన్ని పరిష్కరించా. నా దగ్గర సుంకాలు లేకపోతే, ఆ యుద్ధాన్ని ఎప్పటికీ పరిష్కరించలేరు” అని ఆయన అన్నారు.