ePaper
More
    Homeక్రీడలుKohli Retirement | కోహ్లీ రిటైర్మెంట్‌‌.. గౌతమ్ గంభీర్ ఏమన్నాడంటే..?

    Kohli Retirement | కోహ్లీ రిటైర్మెంట్‌‌.. గౌతమ్ గంభీర్ ఏమన్నాడంటే..?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kohli Retirement | టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohith Sharma) బాటలోనే నడుస్తూ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. సోషల్ మీడియా వేదికగా సోమవారం తన నిర్ణయాన్ని వెల్లడించాడు. గత నాలుగు రోజులుగా తన రిటైర్మెంట్‌పై వచ్చిన వార్తలను విరాట్ కోహ్లీ నిజం చేస్తూ సుదీర్ఘ ఫార్మాట్‌ నుంచి వైదొలిగాడు.

    Kohli Retirement | కోహ్లీ భావోద్వేగం

    టెస్ట్ క్రికెట్‌(Test Cricket) తనకు ఎంతో ఇచ్చిందని, ఎన్నో గుణపాఠాలు నేర్పిందని తన పోస్ట్‌లో విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. గుండె నిండా సంతోషంతో సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు పేర్కొన్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్(Virat Kohli Retirement) ప్రకటించడం అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కోహ్లీ.. ఇంకొన్నాళ్లు టెస్ట్ క్రికెట్ ఆడాల్సిందని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

    READ ALSO  Joe Root | సిరాజ్ చాలా మంచోడు.. దొంగ కోపం ప్ర‌ద‌ర్శిస్తాడు.. రూట్ కామెంట్స్

    మరోవైపు అభిమానులు మాత్రం బీసీసీఐ(BCCI)తో పాటు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌(Gautam Gambhir)పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2025 వైఫల్యంతో విరాట్ కోహ్లీని దారుణంగా అవమానించారని, దాంతోనే ఆట నుంచి వైదొలిగాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గంభీర్ కావాలనే సీనియర్ ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించాడని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీకి కనీసం వీడ్కోలు సిరీస్ అయినా ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.

    మరోవైపు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై గౌతమ్ గంభీర్ స్పందించాడు. సోషల్ మీడియా(Social Media) వేదికగా విరాట్ కోహ్లీ ఆటను కొనియాడుతూ పోస్ట్ పెట్టాడు. కోహ్లీని ఎంతో మిస్సవుతానని పేర్కొన్నాడు. ‘సింహం లాంటి పట్టుదల ఉన్న వ్యక్తివి నీవు! నిన్ను మిస్ అవుతాను చీకూ..’ అని ట్వీట్ చేశాడు.

    READ ALSO  To Let | టూలెట్‌.. పొగ, మద్యం తాగినా పట్టించుకోనంటూ ప్రకటన

    Latest articles

    Mobile Charging | మొబైల్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా.. ఈ టిప్స్ మీకోసమే..

    అక్షరటుడే, హైదరాబాద్: Mobile Charging | మొబైల్ ఫోన్.. మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. అయితే, బ్యాటరీ...

    To Let | టూలెట్‌.. పొగ, మద్యం తాగినా పట్టించుకోనంటూ ప్రకటన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : To Let | బెంగళూరు (Bangalore)లో ఓ యువతి పోస్ట్ చేసిన టూలెట్ (TO...

    Navipet Mandal | రాఖీ కట్టించుకుని ఇంటికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి..

    అక్షరటుడే, బోధన్​: Navipet Mandal | అక్కతో రాఖీ కట్టించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృత్యువాత...

    Mallareddy | నాకు రాజకీయాలు వద్దు.. కాలేజీలు నడుపుకుంటా.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mallareddy | మాజీ మంత్రి, మేడ్చల్​ ఎమ్మెల్యే (Medchal MLA) మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు...

    More like this