Homeబిజినెస్​Gautam Adani | ఈశాన్య రాష్ట్రాల్లో రూ.ల‌క్ష కోట్ల పెట్టుబ‌డులు.. గౌత‌మ్ అదానీ

Gautam Adani | ఈశాన్య రాష్ట్రాల్లో రూ.ల‌క్ష కోట్ల పెట్టుబ‌డులు.. గౌత‌మ్ అదానీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gautam Adani | ఈశాన్య రాష్ట్రాల‌లో రూ. ల‌క్ష కోట్ల పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్లు ‘రైజింగ్ నార్త్ ఈస్ట్ సమ్మిట్’లో గౌతమ్ అదానీ Gautam Adani ప్రకటించారు. గ్రీన్ ఎనర్జీ, రోడ్లు, హైవేలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు వంటి కీలక రంగాల్లో ఇన్వెస్ట్​ చేయనున్నట్లు తెలిపారు. రాబోయే 10 ఏళ్లలో రూ. లక్ష కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు శుక్రవారం ఢిల్లీలో జరిగిన సమ్మిట్​లో అదానీ తెలిపారు.

Gautam Adani | అదానీ ప్ర‌క‌ట‌న‌..

‘ఈ ప్రాంతం మన సాంస్కృతిక గర్వం, ఆర్థిక వాగ్దానం, వ్యూహాత్మక దిశకు మూలంగా ఉంది. రాబోయే 10 సంవత్సరాల్లో అదానీ గ్రూప్ ఈశాన్య ప్రాంతంలో అదనంగా 50,000 కోట్లు పెట్టుబడి పెడుతుందని నేను ప్రకటిస్తున్నాను’ అని అదానీ తెలిపారు. ఇప్పటికే అదానీ సంస్థలు అసోంలో రూ. యాభైవేల కోట్లకుపైగా పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఇందుకు యాడ్ ఆన్‌గా మరో యాభై వేల కోట్ల రూపాయలు పెట్టబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు.