అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Gaudium IVF IPO | గౌడియం ఐవీఎఫ్, ఉమెన్ హెల్త్ లిమిటెడ్‌ను 2015లో స్థాపించారు. దేశంలో 30కి పైగా లొకేషన్స్‌లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ, ఇన్ విట్రో ఫెర్టిలైజెషన్ చికిత్సలను అందిస్తూ దేశంలో మహిళలకు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (In Vitro Fertilization) చికిత్సలను అందించే ప్రముఖ కంపెనీలలో ఒకటిగా ఎదిగింది.
కెనడా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ (United States), కెన్యా, దక్షిణాఫ్రికా, ఒమన్ తదితర దేశాలలోనూ సేవలు అందిస్తోంది. ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఐపీవో ద్వారా రూ. 165 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రెష్ ఇష్యూ కింద రూ. 5 ఫేస్ వ్యాల్యూ కలిగిన 1,13,92,500 షేర్లను విక్రయించడం ద్వారా రూ. 90 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ. 5 ఫేస్ వ్యాల్యూ కలిగిన 94,93,700 షేర్లను విక్రయించి రూ. 75 కోట్లు సమీకరించనుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా వచ్చిన మొత్తాన్ని సంస్ఠ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవసరాల కోసం, అలాగే కంపెనీ తీసుకున్న లోన్స్‌ను పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లించడం కోసం, అదేవిధంగా సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఐపీవోకు బిగ్ షేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టార్‌గా వ్యవహరిస్తుండగా, సార్తి క్యాపిటల్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బుక్ రన్నింగ్ లీడ్ మ్యానేజర్గా వ్యవహరిస్తోంది.
ప్రైస్ బ్యాండ్..
కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 75 నుంచి రూ. 79 లుగా నిర్ణయించింది. ఒక లాట్లో 189 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,931 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిటైల్ కేటగిరిలో గరిష్టంగా 13 లాట్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోటా, జీఎంపీ..
క్యూఐబీలకు 50 శాతం, ఎన్ఐఐలకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం వాటాను కంపెనీ కేటాయించారు. ఈ కంపెనీకి జీఎంపీ రూ. 15 ఉంది. అంటే లిస్టింగ్ సమయంలో 19 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు..
పబ్లిక్ ఇష్యూ ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 20.
ముగింపు తేదీ : ఫిబ్రవరి 24.
షేర్ల అలాట్మెంట్ : ఫిబ్రవరి 25.
లిస్టింగ్ తేదీ : ఫిబ్రవరి 27 (బీఎసఈ, ఎనఎసఈలలో లిస్టవుతాయి)