Alumni Friends | పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
Alumni Friends | పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

అక్షరటుడే, డిచ్​పల్లి: Alumni Friends | డిచ్​పల్లి మండలంలోని ఘన్​పూర్ (Ghanpur)​ జిల్లా పరిషత్​ పాఠశాల 2001‌‌–2002 బ్యాచ్​ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని(Spiritual Gathering of Old Students) ఆదివారం నిర్వహించారు. ఏళ్ల తర్వాత విద్యార్థులంతా ఒక్కచోట చేరి సరదాగా గడిపారు.

ఈ సందర్భంగా బాల్యంలో తాము చదువుకున్న పాఠశాలలో తీపి గుర్తులను నెమరు వేసుకున్నారు. ఎక్కడెక్కడో స్థిరపడిన పూర్వ విద్యార్థులంతా ఒకే వేదికపై కలుసుకోవడం ఎంతగానో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు.