అక్షరటుడే, వెబ్‌డెస్క్: ONGC Gas Leak | కోనసీమ జిల్లా (Konaseema district) ఇరుసుమండలో గ్యాస్ లీక్ అయిన ఘటనలో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో అధికారులు స్థానికులను అక్కడి నుంచి తరలించారు.
ఇరుసుమండలోని మోరీ -5 ఆయిల్ (Mori-5 oil) వెల్ వద్ద సోమవారం మధ్యాహ్నం సమయంలో గ్యాస్ లీకైంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటిని ఓఎన్‌జీసీ సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారు. ఓఎన్‌జీఎస్ బావి నుంచి గ్యాస్ లీక్ అవుతోంది. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఓఎన్‌జీసీ అధికారులకు (ONGC officials) సమాచారం ఇచ్చారు. అయితే దాదాపు ఐదుగంటలు అధికారులు, సిబ్బంది శ్రమిస్తున్న మంటలు అదుపులోకి రావడం లేదు. దీంతో అధికారులు ముందు జాగ్రత్తగా సమీప ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు. ఈ ఘటనతో కిలోమీటర్ మేర ప్రభావం ఉంది. గ్యాస్ లీక్ కాకుండా ఆపేందుకు కనీసం 24 గంటల సమయం పడుతుందన్న ఓఎన్‌జీసీ సిబ్బంది తెలిపారు. గ్యాస్ నిల్వలు అయిపోతేనే మంటలు ఆగుతాయని చెబుతున్నారు.
ONGC Gas Leak | ప్రాణనష్టం జరగలేదు
కలెక్టర్ మహేశ్‌కుమార్ (Collector Mahesh Kumar) ఘటన స్థలాన్ని పరిశీలించారు. మంటలను ఆర్పేందుకు అగ్ని మాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పారు. అయితే మంటలు అదుపులోకి వస్తాయో రావో తెలియాలంటే 24 గంటలు ఆగాలన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. మోరీ -5 ఆయిల్ వెల్‌కు, గెయిల్ పైప్‌లైన్‌కు సంబంధం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. బావిలోని సహజ వాయువు లీక్ కావడంతో మంటలు చెలరేగాయన్నారు. దీనిపై స్పందించిన ఓఎన్‌జీసీ ఫైర్ ఫైటింగ్ సిబ్బందిని పంపిస్తున్నట్లు తెలిపింది. మంటలను అరికట్టేందుకు చర్యలను తీసుకుంటున్నట్లు లేఖ విడుదల చేసింది.
ONGC Gas Leak | సీఎం ఆరా..
ONGC గ్యాస్‌లీక్ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి, ONGC అధికారులతో మాట్లాడారు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. గ్రామస్తులకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు.