అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal | మద్యం బాటిల్‌లో చెత్తచెదారం వచ్చిన ఘటన భీమ్‌గల్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. భూమేష్ అనే వినియోగదారుడు మంగళవారం పురాణిపేట్ కమాన్ వద్ద ఓ వైన్ షాప్‌లో బ్లాక్ అండ్ వైట్ బ్రాండ్ (Black and White brand) మద్యం బాటిల్ కొనుగోలు చేశాడు.
ఇంటికి వెళ్లి తెరిచి చూడగా, బాటిల్‌లో చెత్త కనిపించింది. దీంతో వైన్‌షాప్ యజమానిని (wine shop owner) ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదని చేతులెత్తేసినట్లు భూమేష్ వాపోయాడు. అనంతరం ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు పేర్కొన్నాడు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు. ఈ విషయమై ఎక్సైజ్ సీఐ వేణు మాధవరావును ‘అక్షర టుడే’ వివరణ కోరగా ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తామన్నారు.