అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలోని ఓ హోటల్‌లో నిర్వహిస్తున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బంజారాహిల్స్‌లోని (Banjarahills) ఒక హోటల్‌లో టాస్క్‌ఫోర్స్ (Taskforce) వెస్ట్‌జోన్ పోలీసులు గురువారం దాడులు చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో ఇటీవల వ్యభిచార దందా పెరిగిపోయింది. ఓ వైపు డ్రగ్స్, రేవ్ పార్టీలు కలవరం పెడుతుండగా.. మరోవైపు వ్యభిచారం సైతం జోరుగా సాగుతోంది. తాజాగా పోలీసులు ఓ హోటల్‌పై దాడి చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. ముగ్గురు మహిళలను కాపాడారు.
Hyderabad | హోటల్‌లో దందా..
విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లో ఉన్న ఆర్-ఇన్ హోటల్‌పై దాడి చేశారు. అక్కడ రెండు గదుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిర్వాహకుడితో పాటు ఏడుగురు కస్టమర్లు, హోటల్ రిసెప్షనిస్ట్‌ను అరెస్టు చేశారు. ముగ్గురు మహిళలను రక్షించారు. వారిలో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన మహిళ కూడా ఉన్నారు. వారి నుంచి అధికారులు రూ.5,950 నగదు, 13 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఏడుగురు కస్టమర్లు కర్నూల్ చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
Hyderabad | నిరుద్యోగ యువతులే టార్గెట్
వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తిని ఎండీ షరీఫ్‌గా పోలీసులు గుర్తించారు. గతంలో స్టైల్ మేకర్ సెలూన్ నిర్వహించే అతను అనంతరం ఈ దందాలోకి దిగాడు. నిరుద్యోగ మహిళలను అధిక జీతాలు, కమీషన్ల పేరుతో ఆకర్షించేవాడని, తరువాత వారిని వ్యభిచారంలోకి దింపేవాడని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ సుధీంద్ర (DCP Sudhendra) తెలిపారు.
